బాలయ్యకు ఆ శాఖ కేటాయింపు..ఇక దబిడి దిబిడే..?
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణలు ఇక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.ప్రస్తుతం ఇక్కడ నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ, 2024 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు.
అయితే 2014లో బాలకృష్ణ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలోనే ఆయనకు మంత్రి పదవి లభిస్తోందని అంతా ఆశించారు. కొన్ని సామాజిక కారణాలతో ఆయనకు మంత్రి పదవి లభించలేదు. ఇప్పుడు బాలయ్య గెలవడంతో పాటు, పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన్ను మంత్రిగా చూడాలని అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు ఎంతగానే ఆశపడుతున్నారు. అభిమానులు బాలయ్య మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే అనే డిమాండ్ సైతం సర్వత్రా వస్తోంది. ఐతే ఈ

ఒకవేళ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే పరిస్థితి ఏంటి? ఏ శాఖ ఇవ్వొచ్చు? అనేది కూడా చర్చ జరుగుతోంది. బాలకృష్ణ సినిమాలో హీరో కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖ అయితే బాగుటందని అంతా భావిస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మనసులో సినిమాటోగ్రఫీ మంత్రి ఐతే బాగుంటుందని చంద్రబాబు తన అనుయాయులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంపై సరైన క్లారిటీ రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications