అమరావతి ప్రైడ్.. రూ. 1200కోట్లతో భారీ మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతిపైన ప్రపంచం దృష్టి సారించేలా అద్భుత నిర్మాణాలకు ఏపీ సర్కార్ శ్రీకారం చుడుతుంది. విదేశీ బ్రాండ్ లను అ అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలోని తుళ్ళూరులో భారీ మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
రూ.1,200 కోట్లతో మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్
హైదరాబాద్‌కు చెందిన ఓం శ్రీ భావనసాయి హాస్పిటాలిటీ సంస్థ ఈ ప్రాజెక్టును ప్రమోట్ చేస్తోంది. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ హయత్ ఆధ్వర్యంలో మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.1,200 కోట్లు.

రెండు టవర్లు..హయత్ రీజెన్సీ హోటల్ కూడా
సుమారు 6.5 ఎకరాల స్థలంలో రెండు టవర్లు టవర్ ఏ - హోటల్, టవర్ బి - బిజినెస్ సెంటర్ నిర్మిస్తున్నారు. నాలుగు బేస్‌మెంట్లు, గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్‌తో కలిపి దాదాపు 47 అంతస్తుల నిర్మాణం చేయనుంది. మొత్తం నిర్మిత వైశాల్యం 3.75 మిలియన్ చదరపు అడుగులు. హయత్ రీజెన్సీ హోటల్‌లో 422 లగ్జరీ గదులు, మూడు బ్యాంకెట్ హాళ్లు, మల్టీ-కుషన్ రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, వెల్‌నెస్ సెంటర్ ఉంటాయి.
వాక్-టు-వర్క్ కాన్సెప్ట్‌తో నివాసం, కార్యాలయం, షాపింగ్, వినోదం అన్నీ ఒకేచోట
అదనంగా సుమారు 1.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, 5 లక్షల చదరపు అడుగుల వాణిజ్య/రిటైల్ స్పేస్ షాపింగ్ మాల్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. వాక్-టు-వర్క్ కాన్సెప్ట్‌తో నివాసం, కార్యాలయం, షాపింగ్, వినోదం ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ నిర్మాణానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్
అనుమతులు రాగానే పూర్తి స్థాయి నిర్మాణం ప్రారంభమవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ పక్కన, గవర్నమెంట్ సిటీకి సమీపంలో ఉండటం వల్ల ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలో కీలక లొకేషన్ అవుతుంది. పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ, సీవరేజ్ ట్రీట్‌మెంట్ వంటి గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు ఈ ట్విన్ టవర్స్ నిర్మాణంలో పాటిస్తున్నారు. భారీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని గ్లోబల్ బిజినెస్, హాస్పిటాలిటీ హబ్‌గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.













Click it and Unblock the Notifications