"జనసేన ఎమ్మెల్యే రాసలీలలపై క్లారిటీ..అది పూర్తిగా డీప్ ఫేక్ వీడియో"
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫేస్ బుక్ ద్వారా మహిళను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి సుమారు ఏడాదిన్నరగా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణలపై తాజాగా ఎమ్మెల్యే తల్లి ప్రమీల స్పందించారు. నా బిడ్డ అమాయకుడు, ఉత్తముడు అని స్పష్టం చేశారు. ఒకే కులం కావడం వల్ల తరచూ రావడం వెళ్లడం జరుగుతుండేది.. సాయం కోసం మా ఇంటికి రాత్రి వేళల్లో వచ్చి టార్చర్ పెట్టేది.. మా కొడుకు అమాయకుడు అని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల పేర్కొన్నారు.
నా బిడ్డ అమాయకుడు, బుద్ధిమంతుడు.
— oneindiatelugu (@oneindiatelugu) January 27, 2026
నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేయాలని చూశారు
— ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి#AravaSreedhar #PawanKalyan #JanasenaMLA #PoliticsToday #AndhraPradesh #OITelugu pic.twitter.com/WGd9GJ9cLJ
'మా కొడుకును అభాసుపాలు చేసింది. మా కోడుకును వేధిస్తుండడంతో రైల్వేకోడూరు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశా అని అన్నారు. మా కుమారుడికి ఉన్న మంచి పేరును దురుద్దేశంతో చెడగొట్టాలని ప్లాన్ చేసిందని ప్రమీల మండిపడ్డారు. మహిళ వెనుక వైసీపీ లేదా ఇతురులు ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనే అనుమానం ఉందన్నారు.

ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు మాట్లాడుతూ.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ట్రాప్ అని అన్నారు. "అది పూర్తిగా డీప్ ఫేక్ వీడియో అని తెలిపారు. ఎమ్మెల్యేను పెళ్లి చేసుకుంటా.. నాకు ఇంకా పెళ్లి కాలేదు.. మేము మీకు బంధువులం అవుతామని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లికి చెబితే వాళ్లు ఆమెను తీవ్రంగా ఖండించి పంపించారు. ఇది ఒక హనీ ట్రాప్.. జనసేన పార్టీకి ఏ విధంగా సంబంధం లేదు. న్యాయానికి అండగా ఉండాలని మేము ఎమ్మెల్యేను కోరుతున్నాం.." అని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications