ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే చంద్రావతి అరెస్ట్, ఆలోచించాలని నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

MLA Chandravathi Arrested
ఖమ్మం/హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా శాసన సభ్యురాలు, సిపిఐ నాయకురాలు చంద్రావతిని ఎన్కూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం అధికారుల తీరుకు నిరసనగా ఆమె ఎన్కూరులో ఎమ్మెల్యే చంద్రావతి రాస్తారోకో చేశారు. ఈ విషయమై చంద్రావతిని అరెస్టు చేశారు.

మరోవైపు, చంద్రావతి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు కూడా. అయితే, చంద్రావతి పార్టీ మార్పు ఊహాగానాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందించారు. చంద్రావతి తొందరపడి నిర్ణయం తీసుకోరాదన్నారు. ఆమె పునరాలోచించాలన్నారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులపై సిపిఐ చర్చిస్తోంది. తెరాసతో వెళ్లే అవకాశాలున్నాయి. అలాగే లోక్ సత్తా పార్టీతోను పని చేసేందుకు సిద్ధంగా ఉంది.

గుర్నాథ్ మెలిక

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అనంతపురం జిల్లా ఎంపి వెంకట్రామి రెడ్డి చేరికతో ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అసంతృప్తికి గురైనప్పటికీ తాను పార్టీలో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనంతతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి పని చేసే ప్రసక్తి లేదని చెప్పారు. తాను పార్టీని వీడనని, అనంతతో మాత్రం కలిసి పని చేయనని మెలిక పెట్టారట.

English summary
Khammam district Vaira MLA Chandravathi arrested on Wednesday by Enkur police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X