ఏపీలో మరో ఎమ్మెల్యే ఆడియో కాల్ లీక్..మహిళతో అసభ్యంగా

రాజకీయ నాయకులంటే సామాన్య ప్రజానికానికి ఆదర్శంగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే వారే మరింత అశ్లీలంగా తయ్యారవుతున్నారు.పలువురు నేతల మాటల్లోనూ, చేష్టల్లోనూ, నిలకడలేనితనంలోనూ, విషయాలపై అవగాహనా రాహిత్యంలోనూ... ప్రజల చీత్కారాలను ఎదుర్కోంటున్నారు.తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ఆమె పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం లేఖ రాసిన రాశారు. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా విజయం సాధించిన దగ్గర నుంచి తనపై కక్షగట్టి , అసభ్యకరంగా ప్రవర్తిస్తూ , తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మీ తెలిపారు. కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికి, ఆయన నుంచి వేధింపులు ఎక్కువైయ్యాయని, ఆ తర్వాత నన్ను భయబ్రాంతులకు గురి చేసి, నన్ను లైంగికంగా చెరిచాడని ఆమె చెప్పారు. ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామంధుడు టార్చర్ చేస్తున్నాడని ఆమె తెలిపింది.

MLA Koneti Adimulam Leaked Viral Audio

అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనలతో, కోనేటి ఆదిమూలం బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో హోటల్‌లో సీక్రెట్ కెమెరాతో , ఎమ్మెల్యే కామ క్రీడలను రికార్డు చేశామని వరలక్ష్మీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత బాధితురాలుతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సయోధ్య చేసుకోవడంతో సమస్య ముగిసిపోయింది.

అయితే సదరు ఎమ్మెల్యే మరో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం పేరుతో ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే ఆదిమూలం మరో మహిళతో అసభ్యంగా మాట్లాడారని చెబుతున్న ఆడియో ఒకటి తెరపైకి వచింది. ఈ ఆడియోలో నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నీ పర్సనాలిటీ చాలా బాగుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది కోనేటి ఆదిమూలం ఆడియో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ఆదిమూలం ఇప్పుటి వరకు స్పందించలేదు. అయితే ఈ ఆడియో అసలు ఎమ్మెల్యేదేనా కాదా అని తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+