పవన్ కళ్యాణ్‌కు తిక్క.. పిచ్చోడి చేతిలో రాయిలా వారాహి యాత్ర: ఎమ్మెల్యే మల్లాది విష్ణు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా మండి పడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన తక్షణమే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మల్లాది విష్ణు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై మల్లాది విష్ణు వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆయన దుయ్యబట్టారు.

 MLA Malladi vishnu

పవన్ కళ్యాణ్ తన వారాహి విజయయాత్రలో తన విధానాలను చెప్పుకోవాలి కానీ ఇతరులను దూషించటం సరికాదని మల్లాది విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పడం దిగజారుడుతనం అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని అభిప్రాయపడిన మల్లాది విష్ణు, వాలంటీర్ల వ్యవస్థను గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదన్నారు.

వాలంటీర్ల వ్యవస్థ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, తన వ్యాఖ్యలకు ఉన్న ఆధారాలను చూపించాలని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి నీచంగా మాట్లాడారని, వాలంటీర్లను కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడని అసహనం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కు మామూలుగానే తిక్క ఉందని, ఆ తిక్క తోనే వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మల్లాది విష్ణు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటికైనా దిగజారుడు వ్యాఖ్యలు ఆపాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+