వైసీపీ నాయకులకు నో చెప్పిన హీరో బాలయ్య, మీ సేవలు మాకు అవసరం లేదు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దెబ్బకు వైసీపీ నాయకులు షాక్ అయ్యారు. మేము టీడీపీలో చేరుతాము మొర్రో అంటుంటే కుదరదని ఎమ్మెల్యే బాలయ్య వైసీపీ కౌన్సిలర్లకు తేల్చి చెప్పారని తెలిసింది.
గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హిందూపురంలో మునిసిపాలిటీ ఎన్నికలు జరిగాయి, ఆ సందర్బంలో 38 సభ్యులు ఉన్న హిందూపురంలో వైసీపీకి నాయకులు ఎక్కువగా కౌన్సిలర్లగా విజయం సాధించారు. హిందూపురం వైసీపీ ఖాతాలో పడింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ కౌన్సిలర్ ఇంద్రజ ఎన్నిక అయ్యారు. వారం రోజుల వరకు హిందూపురం మునిసిపాలిటీలో వైసీపీ హవా కొనసాగింది.

హిందూపురం మునిసిపాలిటీలో టీడీపీ, బీజేపీకి కూటమికి 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూపురంలో సీన్ మారిపోయింది. వైసీపీ నాయకుల పెత్తనంతో విసిగిపోయిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 12 మంది కౌన్సిలర్లు ఇటీవల ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు.
హిందూపురం మునిసిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 12 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ దెబ్బతో హిందూపురం మునిసిపాలిటీలో వైసీపీ మెజారిటీని కోల్పోయింది. ఇప్పుడు హిందూపురం మునిసిపాలిటీలో టీడీపికి 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. హిందూపురం మునిసిపాలిటీ ఇప్పుడు టీడీపీ ఖాతాలో పడనుంది. వైసీపీకి చెందిన 8 మంది కౌన్సిర్లు మాత్రమే ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. మిగిలిన ఐదు మంది వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడు టీడీపీలో చేరుతామని టీడీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
అయితే ఇప్పటికే 20 మంది కౌన్సిలర్లతో చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి అవకాశం ఉందని, మిగిలిన ఐదు మంది వైసీపీ కౌన్సిలర్లు మనకు అవసరం లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తేల్చి చెప్పారని తెలిసింది. అయితే మా పార్టీకి చెందిన కౌన్సిలర్లను అక్రమంగా టీడీపీలో చేర్చుకున్నారని, వారిని సమావేశంలో నిలదీస్తామని వైసీపీ కి చెందిన కౌన్సిలర్లు అంటున్నారని తెలిసింది హిందూపురం చైర్మన్ ఇంద్రజ ఇప్పటికే ఆమె పదవికి రాజీనామా చెయ్యడంతో ఆమె రాజీనామాను ఆమోదించడానికి మునిసిపల్ శాఖ అదికారులు సిద్దం అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications