జగన్ పార్టీ జడ్పీ ఛైర్మన్‌తో వాగ్వాదం: మైక్ విరగ్గొట్టిన వాకాటి
శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమైన తర్వాత సాగునీటిపై చర్చ జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ .
నెల్లూరు: శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమైన తర్వాత సాగునీటిపై చర్చ జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్ర రెడ్డి ఆయన మైక్‌ను కట్ చేశారు.
ఈ క్రమంలో సమావేశంలో వివాదం రగులుకుంది. తన మైక్ కట్ చేయడం పట్ల వాకాటి నారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మైక్ ఎందుకు కట్ చేశారంటూ.. మైక్‌ను కిందకు విసిరేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వాకాటికి మద్దతుగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర సభ్యులు నినాదాలు చేశారు.

వివాదం ముదురుతుండటంతో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను సముదాయించడంతో సమావేశం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. పది నిమిషాల అనంతరం సమావేశం మళ్లీ కొనసాగింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications