అమ్మా పురందేశ్వరిగారూ.. అంటూనే ఏకిపారేసిన విజయసాయి రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్టు అయిన తర్వాత నుండి ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నారా లోకేష్ ను తీసుకుని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై వివరించారు. దీంతో వైసిపి నేతలు పురంధరేశ్వరి ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
పురందరేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

అంతేకాదు ఒక ఫేక్ అగ్రిమెంట్‌తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఆ ఒప్పందం ఫేక్ అని సీమన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఆ అగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది! ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్‌మెంట్‌లో చెప్పింది అని సిమెన్స్ కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి పేర్కొన్నారు.
సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో స్వయంగా బాబు పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఒక చిన్న కేసులో ఏకంగా 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తరవాత షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిందని పేర్కొన్నారు.
అంతేకాదు చంద్రబాబుకు పంపించిన షోకాజ్ నోటీసులను కూడా విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇంత జరుగుతున్న ఆయనకు చట్టం వర్తింప చేయడానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేయడం ఏమిటి అని పురంధరేశ్వరిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. అమ్మా పురందరేశ్వరి అంటూనే చంద్రబాబు వ్యవహారంలో ఆమె జోక్యాన్ని ఏకి పారేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications