వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష: చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మాంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణితో కలిసి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది.

శనివారం ఉదయం ముద్రగడ సతీమణి పద్మావతికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చక్కెర నిల్వలు స్థాయిలు పడిపోయాయని తెలిపారు. కాకినాడ నుంచి కిర్లంపూడికి ప్రత్యేకంగా వచ్చిన వైద్యుల బృందం ప్రతి 3 గంటలకు ఒకసారి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.

మరోవైపు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు శుక్రవారం రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ముద్రగడ చెప్పిన అంశాలను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో భాగంగా సముద్రంలో ఉన్నారు.

మధ్యాహ్నా ప్రాంతంలో గానీ చంద్రబాబు బీచ్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ముద్రగడతో జరిపిన భేటీలోని అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కుదిరితే శనివారం సాయంత్రానికి ముద్రగడ దీక్షను విరమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

శనివారం ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కానీ మరో మంత్రి కానీ ముద్రగడను కలిసే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బొడ్డు వెల్లడించారు. ఇదిలా ఉంటే ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా అమలాపురంలో నల్లా పవన్ కుమార్, నల్లా విజయ్ కుమార్ అనే సోదరలు దీక్షకు దిగారు.

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష


కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుల బృందం.

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దక్ష

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దక్ష


కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలుపుతున్న కాపు నేతలు.

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష


కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నిరాహార భాగంగా పళ్లెంపై గరిట��తో కొడుతున్న ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి.

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష

రెండో రోజుకు ముద్రగడ నిరాహార దీక్ష


కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్ష శనివారానికి రెండో రోజుకు చేరుకుంది.

English summary
Mudragada Padmanabham indefinite hunger strike enters second day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X