Mudragada Padmanabham: పవన్ కు కూతురి మద్దతుపై ముద్రగడ రియాక్షన్ ఇదే..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు, వారి ప్రత్యర్థులపై ఎత్తులు, పై ఎత్తులతో సాగిపోతుండగా.. ఇదే క్రమంలో కొందరు నేతలకు ఇంటిపోరు తప్పడం లేదు. పిఠాపురంలో జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీలో చేరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం పరిస్ధితి ఇదే.
పిఠాపురంలో పవన్ ను ఓడించి తరిమి కొట్టకపోతే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ తాజాగా ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ ఆయన కుమార్తె క్రాంతి ఇవాళ ఓ వీడియో విడుదల చేసారు. ఇందులో తండ్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముద్రగడ అభిమానులు సైతం ఆయనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. పవన్ ను తిట్టేందుకే తన తండ్రిని వాడుకుంటున్నారని ఆరోపించారు. తన మద్దతు పవన్ కే ఉంటుందన్నారు. దీనిపై ముద్రగడ స్పందించారు.

పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన ముద్రగడ కుమార్తె క్రాంతి..!!#PawanKalyan #Janasena #MudragadaPadmanabham #Kranthi #ApElections2024 #Oneindiatelugu pic.twitter.com/XTyCojShFf
— oneindiatelugu (@oneindiatelugu) May 3, 2024
కుమార్తె క్రాంతి పవన్ కు మద్దతుగా విడుదల చేసిన వీడియోపై స్పందించిన ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు.తన కుమార్తె వీడియో విడుదలపై బాధపడినా భయపడనున్నారు. తన కూతురుతో కొంతమంది ఈ వీడియో విడుదల చేయంచారన్నారు. ఎవరు బెదిరించినా భయపడను, జగన్ కు సేవకుడిగా ఉంటానన్నారు. కూతురికీ, తనకూ మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారన్నారు. కానీ ఎవరు బెదిరించినా తాను భయపడనని ముద్రగడ తేల్చిచెప్పేశారు.












Click it and Unblock the Notifications