మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా.. ప్రోటోకాల్ సహా దక్కేది ఇవే..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు (ఆదివారం) పోలింగ్.. నవంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. తొలి వారంలో అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో మేయర్ స్థానం నుంచి కార్పోరేటర్, వార్డు కౌన్సిలర్ వరకు హోరా హోరీగా పోరు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి దక్కే జీత భత్యాలు.. హోదా పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
స్థానిక ఎన్నికల్లో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. పార్టీలు తమ అభ్యర్ధుల గెలుపు కోసం తీవ్రం గా శ్రమిస్తున్నాయి. ప్రతీ చోట విజయం కోసం పోరాటం నెలకొంది. వార్డు సభ్యుడి నుంచి నగర మేయర్ వరకు ప్రతీ సీటు ప్రతిష్ఠాత్మకమే. ఈ సారి ఎన్నికల్లో నగదు కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం సాగుతోంది. కాగా.. అసలు ఈ ఎన్నికల్లో గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, కార్పోరేటర్, కౌన్సిల్ అయ్యే వారికి ప్రభుత్వం జీత భత్యాలు గౌరవ వేతనంగా చెల్లిస్తుంది. అయితే... గెలిచిన వారికి తమ సంబంధిత నగరాలు, పట్టణాలు, వార్డుల్లో మాత్రం తొలి ప్రాధాన్యత ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఏ పార్టీ అభ్యర్ధికి అయినా.. స్థానిక బలమే కీలకం అవుతుంది. దీంతో.. ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకోవటం కోసం శ్రమిస్తారు. మేయర్ గా గెలుపొందిన వారికి ప్రత్యేక హోదా ఉంటుంది. వారికి వేతనాలతో పాటుగా సిబ్బంది కేటాయింపు జరుగుతుంది. ఆ నగరంలో ప్రధమ పౌరుడిగా గుర్తింపు దక్కుతుంది.

స్థానికంగా హోదా.. గుర్తింపు
కాగా, రాష్ట్రంలో ఏ మేయర్ కు అయినా నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది. డిప్యూటీ మేయర్‌కు 32,500, కార్పొరేటర్‌కు రూ.7,800 ప్రతి నెలా జీతంగా అందుతుంది. అయితే, మున్సిపల్ ఛైర్ పర్సన్ విషయంలో మాత్రం జనాభా ప్రాతిపదికన జీతాలు ఖరారు చేసారు. 50 వేల జనాభా దాటిన చోట మున్సిపల్ ఛైర్మన్ కు రూ 19,50, డిప్యూటీ ఛైర్మన్ రూ 9,750, కౌన్సిలర్లకు రూ.4,550 జీతం అందుతుంది. అదే విధంగా 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాల్టీల్లో ఛైర్పర్సన్లకు రూ.15,600.. డిప్యూటీ ఛైర్పర్సన్లకు రూ.6,500, కౌన్సిలర్లకు రూ.3,250 చొప్పున జీతాలు అందుతాయి. ఇక.. వీరికి ప్రత్యేకంగా అలవెన్సులు పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. అయితే.. నగరంలో జరిగే కార్యక్రమాల్లో మాత్రం వారికి ప్రోటోకాల్ అమలు చేస్తారు. దీంతో.. స్థానికంగా దక్కే గౌరవం.. గుర్తింపు కోసం ప్రతీ అభ్యర్ది గెలుపు కోసం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.













Click it and Unblock the Notifications
