హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంతో న్యాయ పోరాటం: కోర్టుకు ఎన్ కన్వెన్షన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంతమేరకు ఆక్రమిత భూముల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖ అధికారులు శుక్రవారం, శనివారం సంయుక్తంగా తమ్మిడికుంట పరిసరాలను పరిశీలించి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమిత భూముల్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే, దీనిపై ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం న్యాయపోరాటం చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమిత భూమిలో ఉన్నదంటూ జీహెచ్ఎంసీ అధికారులు శుక్ర, శనివారాల్లో మార్ఫింగ్ కూడా చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు రెండు మూడు రోజుల్లో నోటీసులు కూడా ఇవ్వవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లాలని యాజమాన్యం భావిస్తోందట.

N Convention issue: Management seeing at court!

కాగా, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో తమ్మిడికుంటకు చెందిన 3 ఎకరాలా 12గుంటల భూమిని కలుపుకొన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 1.12 గుంటల భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలోది కాగా, 2 ఎకరాల భూమి బఫర్ జోన్ కిందకు వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సర్వే నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

English summary
The authorities said the survey and marking of Full Tank Level (FTL) of the lake is being taken up following allegations that some of the constructions including the N Convention Centre owned by actor Nagarjuna came up on the lake bed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X