పవన్ కళ్యాణ్ పార్టీకి నాగబాబు పెద్ద మైనస్ .. శివాజీపై నాగబాబు వ్యాఖ్యలతో చర్చ!

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చారా? యాక్టర్ శివాజీ హీరోయిన్ల బట్టల పైన చేసిన వ్యాఖ్యలతో విభేదించిన నాగబాబు ఆడవాళ్ళ బట్టలపై మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అంటూ ప్రశ్నించి పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఇరకాటంలో నెట్టారా? అంటూ అవును అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు.

పవన్ కళ్యాణ్ ఆలోచనలకూ,నాగబాబు ఆలోచనలకూ చాలా తేడా
సనాతన ధర్మాన్ని పాటించాలని పదే పదే గొంతు చించుకునే పవన్ కళ్యాణ్ నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించరు అని జన సైనికులు కూడా భావిస్తున్న వేళ నాగబాబు జనసేన పార్టీకి పెద్ద మైనస్ అవుతారా? అన్న చర్చ ఒక జోరుగా సాగుతుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు.

Nagababu may be minus to Pawan Kalyan party Nagababu comments on Shivaji is a cause of debate

పవన్ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి
ఆయన మాత్రమే కాదు, ఆయన సతీమణి అన్నా లెజినోవా రష్యాలో జన్మించినా, ప్రముఖ మోడల్ గా పనిచేసినా సరే ఆయన బాటలోనే చక్కగా చీర కట్టుకొని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు అన్ని రంగాలలో గొప్పగా ఎదగాలని ప్రోత్సహించే వ్యక్తి, అలాగని మహిళల విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేస్తాడు అనేది ఎవరూ అంగీకరించని విషయం.

పవన్ పార్టీలో కీలకంగా ఉన్న నాగబాబు వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, ఆయన ఆలోచన విధానం దీనిని బలంగా నొక్కి చెబుతోంది. ఇక అటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగబాబు తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యల పైన ఘాటుగా స్పందించారు. సమాజంలో మోరల్ పోలీసింగ్ పెరిగిపోయిందని వ్యాఖ్యలు చేశారు. మోరల్ పోలీసింగ్ ఒక సామాజిక రుగ్మత అంటూ టార్గెట్ చేశారు.

ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మీరెవరు మాట్లాడటానికి.. ఫైర్ అయిన నాగబాబు
మగ అహంకారంతో మహిళల ప్రవర్తన, దుస్తులపై తీర్పులు చెప్పే ధోరణితో తాను శివాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదన్నారు. ఈ ధోరణి ఆయనలోనే కాదు సమాజంలోని ఆలోచనా విధానంలో ఉందన్నారు. ఆడపిల్లల డ్రెస్సింగ్ పైన వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే దానిపైన మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. రాజకీయంగా కాదు తాను ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను అని చెప్పారు.

పవన్ పార్టీకి నాగబాబు పెద్ద మైనస్ అంటూ చర్చ
నాగబాబు సామాన్యుడిగా మాట్లాడుతున్నా అని చెప్పినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన పార్టీలో నాగబాబు ఉండడం వల్ల, నాగబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీకి పార్టీ అధినేతకు ఆపాదించి జనం చూస్తున్నారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో కూడా అంతర్గత చర్చకు కారణంగా మారింది. ఇక సోషల్ మీడియాలో జనసేనకు నాగబాబు పెద్ద మైనస్ అవుతాడు అన్న చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+