పవన్ కళ్యాణ్ ‘ది రియల్ యోగి’: క్రేజీ హీరో.. ఫైనాన్షియల్‌గా నథింగ్, కానీ..!

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా తాను ఒకరోజైనా ఉండగలనా? అని ఆయనను చూసిన కొన్ని వందలసార్లు అనుకుని ఉంటానని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్‌పై గుణ రచించిన 'ది రియల్ యోగి' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది.

పవన్ కళ్యాణ్‌లా ఒకరోజైనా ఉండాలనుకున్నా: నాగబాబు

పవన్ కళ్యాణ్‌లా ఒకరోజైనా ఉండాలనుకున్నా: నాగబాబు

జనసేన నేత నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై 'ది రియల్ యోగి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌లా తాను ఒకరోజైనా ఉండగలనా అని అనుకునేవాడినని అన్నారు. పవన్ పై తనకున్న అభిప్రాయాన్నే గుణ తన పుస్తకంలో రాశాడన్నారు. చిన్నప్పటి నుంచి పవన్ ఒంటరిగా ఉండేటటువంటి వ్యక్తిత్వమన్నారు. తాను అప్పుడప్పుడు ఏడిపించేవాడినని చెప్పారు. కానీ, పదో తరగతి తర్వాత పవన్ గురించి తమకు కొంచెం కొంచెం అర్థమవుతూ వచ్చిందన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి

పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి

పవన్ ఆలోచించే విధానం చాలా తేడావుంటుందన్నారు. చిరంజీవి తమ్ముడైన మాత్రాన సినిమాలు ఇవ్వాలని రూల్ లేదు. పవన్ అన్ని సినిమాలు ఒప్పుకోడని చెప్పారు. పవన్ కళ్యాణ్ టీడీపీ లేదా బీజేపీలోనే, ఏ పార్టీలోనే చేరినా మంత్రి పదవి వచ్చేదన్నారు. అయితే, పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని చెప్పారు. లంచగొండి, అవినీతిపరులను నిలదీయడానికే పార్టీ పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని నాగబాబు చెప్పారు.

పవన్ కళ్యాణ్ క్రేజీ హీరోనే కానీ..

పవన్ కళ్యాణ్ క్రేజీ హీరోనే కానీ..

పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడైతే కోట్లాది మందికి సహాయం చేయగలనని భావించాడని నాగబాబు తెలిపారు. పవన్ తమ ఇంట్లో పుట్టాడు కాబట్టి అతని గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నాని అన్నారు. పవన్ చాలా విషయాల్లో సఫర్ అయ్యారన్నారు. రేపు ఎలా ఉండాలన్న ఆలోచన్ పవన్‌కు ఉండదన్నారు. మనిషి ఎలా ఉండాలో పవన్ ఉదాహరణ అన్నారు. క్రేజీ హీరో.. ఫైనాన్షియల్‌గా ఏంలేదు.. మనిషిగా మాత్రం గొప్పవాడు.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారని చెప్పారు. పవన్ వ్యక్తిత్వం ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్నారు నాగబాబు.

పవన్ కళ్యాణ్‌కు భక్తులే ఎక్కువ

ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు భక్తులు ఎక్కువ ఉంటారని చెప్పారు. ఆయనపై గుణ రాసిన ది రియల్ యోగి పుస్తకం చాలా బాగుందన్నారు. పవన్ కొంత మందికి చల్లగాలి.. మరికొంతమందికి పిల్లగాలి అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ, నిర్మాత విశ్వప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+