నాగబాబు ఆస్తులెంత - అన్నయ్య, పవన్ కు అప్పు లెక్కలిలా..!!
మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు టీడీపీ నుంచి నామినేషన్లు వేయనున్నారు. వారి పేర్లను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు.
నాగబాబు ఆస్తులు
జనసేన నుంచి నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపర్చారు. నాగబాబు తన ఆస్తుల విలువ70 కోట్లుగా వెల్లడించారు. నాగబాబుపైన ఎలాంటి కేసులు లేవు. కాగా, తనకు ఉన్న అప్పుల లెక్కలను వెల్లడిస్తూ అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ దగ్గర తీసుకున్న అప్పుల గురించి వివరించారు. నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లుగా పేర్కొన్నారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ .. బాండ్ల రూపంలో రూ.55.37 కోట్లు ఉండగా, చేతిలో నగదు - రూ.21.81 లక్షలు ఉంది.

ఇవీ లెక్కలు
ఇక, బ్యాంకులో తన ఖాతాల్లో రూ 23.53 లక్షలు ఉన్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇతరుల నుంచి తాను రూ 1.03 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న బెంజ్ కారు విలు వ రూ 67.28 లక్షలుగా వెల్లడించారు. హ్యుండాయ్ కారు - రూ.11.04 లక్షలు, కాగా ఇక.. బంగారం -వెండి విలువ రూ.57.99గా వివరించారు.724 గ్రాముల బంగారం, తన సతీమణి వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు) ఉన్నాయి. అదే విధంగా.. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
చిరంజీవి- పవన్ నుంచి అప్పు
హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపర్చారు. రంగా రెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి విలువ రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరా ల భూమి రూ.82.80 లక్షలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి ఉండగా.. దాని విలువ రూ.53.50 లక్షలుగా పేర్కొన్నారు. హైదరాబాద్ మణికొండలో విల్లా - రూ.2.88 కోట్లు గా వివరించారు. కాగా.. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.11.20 కోట్లు. ఇక.. తన సోదరులు చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు తీసుకోగా.. పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకు న్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇక, బ్యాంకుల్లో ఇంటి రుణం కింద రూ 56.97 లక్షలు, కారు కోసం తీసుకున్న రుణం రూ 7.54 లక్షలు ఉన్నట్లు వివరించారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications