Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుపై మెగా బ్రదర్‌ సెటైర్స్..?

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ''వయస్సు ఎక్కువ , పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు'' అంటూ ఓ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో నాగబాబు ఓ పోస్ట్ చేశారు. దీనిపై మళ్లీ వివరణ ఇస్తూ ఏమి మాట్లాడిన మా గురించే అని ఆపాదించుకుంటున్నారు.

ఇది ఎన్నికల సమర సమయం, నా ఉద్దేశాలు చెబుతున్న తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు.. పైన చెప్పింది జీవిత సత్యం అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే నాగబాబు చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం కావడం లేదు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ.. నాగబాబు చేసిన ఈ ట్వీట్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించే చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Nagababu Sensational Tweet viral on ap political circle

దీనికి అనేక కారణాలను కూడా వారు చూపిస్తున్నారు. టీడీపీతో పొత్తు వల్ల నాగబాబు టికెట్‌కు ఎసరొచ్చిందని.. అందువల్లే నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడంతో నాగబాబుకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.

Nagababu Sensational Tweet viral on ap political circle

తనకు టికెట్ దక్కపోవడానికి చంద్రబాబే కారణామని భావించిన నాగబాబు ఆయనపై ఇలా పరొక్షంగా సెటైర్స్ వేసి ఉంటారని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు, ఆ మధ్య టీడీపీ , జనసేన పొత్తు సమయంలో మీడియాకు ఇచ్చిన ఫొటో సెషన్‌లో కూడా నాగబాబును పవన్ కల్యాణ్ పక్కకు తప్పుకోవాలని సూచించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన ఆయన తన అసహనాన్ని ఇలా బయటపెట్టి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ నాగబాబు వైసీపీ అధినేత జగన్ గురించే ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవడానికి .. నాగబాబు వయస్సు కన్నా జగన్ వయస్సు తక్కువే. దీంతో నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైసీపీ గురించి కాదు అని తెలుస్తోంది. ఎవరిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+