కరోనాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు .. ఏమన్నారంటే

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కాగా మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏపీలోనూ రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి కరోనా నివారణకు కష్టపడుతున్నాయి.

కరోనా నుండి బయటపడటానికి శాస్త్రవేత్తల ప్రయోగాలు

కరోనా నుండి బయటపడటానికి శాస్త్రవేత్తల ప్రయోగాలు

ఇక కరోనా నివారణ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. యాగాలు, యజ్ఞాలు చేస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని భావిస్తున్న వారు లేకపోలేదు .ఇక ఈ నేపధ్యంలో మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా నుండి బయట పడటానికి, ఈ మహమ్మారిని ఎలా తరిమికొట్టటానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే 170పైగా కేసులు నమోదుకాగా టెన్షన్ పడుతుంది భారత ప్రజానీకం .ఒకపక్క కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇక స్వామీజీలు , మతప్రబోధకులు ఎవరికి తోచింది వారు చెప్తున్నారు.

సైంటిస్టులకి మొక్కుదామన్న నాగబాబు

సైంటిస్టులకి మొక్కుదామన్న నాగబాబు

భగవంతుడే కాపాడాలని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న నేపధ్యంలో ఇక కరోనా పై మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ ద్వారా సంచలన కామెంట్లు చేశారు. ' మా దేవుడు గొప్ప,మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి. దేవుళ్ళు, స్వామిజీలు దేవుడి ప్రతినిధులు ఏమి పీకలేక గుళ్ళు ,ప్రార్థన మందిరాలు ఇంకా అన్ని మూసుకొని కూర్చుని సైంటిస్ట్ లు డాక్టర్స్ ఏ మందు కనిపెట్టి మనలని కాపాడతారా అని ఎదురు చూస్తున్నారు. వెళ్లి సైంటిస్టులకి మొక్కుదాం.ఈ కరోనా బారినుంచి మనల్ని కాపాడేది వాళ్లే." అని నాగబాబు ట్వీట్ చేసారు.

నాగబాబు ట్వీట్ పై ఆసక్తికర చర్చ

నాగబాబు ట్వీట్ పై ఆసక్తికర చర్చ

ఇప్పుడు ఈ ట్వీట్ పై పెద్ద చర్చ జరుగుతుంది . నాగబాబు ఇటీవల దేశంలో, అటు ఏపీలో మత పరమైన పలు వివాదాలు కొనసాగుతున్న తరుణంలో కరోనా వైరస్ విషయంలో చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచించేలా చేసింది. మా దేవుళ్ళే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఏ దేవుడు ఈ మహమ్మారి నుండి కాపాడతారో చెప్పాలని ఆయన సంధించిన ప్రశ్నలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+