కొంప ముంచిన నాగబాబు ట్వీట్ ..!
బిగ్ బాస్ హౌస్‌లో ఆరోవారంలో జరిగిన ఎలిమినేషన్ ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చింది. టాప్-5లో ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ అనుకున్న కంటెస్టెంట్ భరణి ఎలిమినేట్ కావడం ఎవరూ ఊహించలేదు. ఐదోవారం దమ్ము శ్రీజా ఎలిమినేషన్ షాకింగ్ అనుకుంటే, భరణి ఎలిమినేషన్ అంతకుమించిన ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ఈ ఊహించని ఎలిమినేషన్ వెనుక మెగా బ్రదర్, జనసేన నేత , ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ఒక్క ట్వీట్ కారణమైందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
భరణి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే, నాగబాబు అతనికి బహిరంగంగా మద్దతు తెలిపారు. భరణితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. దీంతో భరణికి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ దొరికింది, జనసైనికుల మద్దతు కూడా తోడైందనే అంచనాలు గట్టిగా వినిపించాయి. భరణి పీఆర్ టీమ్ కూడా మెగా ఓటింగ్ కోసం, ఆయన నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియోలను వైరల్ చేసింది.అయితే, సీన్ కట్ చేస్తే... ఈ సపోర్టే భరణికి పెద్ద శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాగబాబు కేవలం పవన్ కల్యాణ్‌కు అన్నయ్యే కాదు, ప్రస్తుతం జనసేనలో కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ కూడా. ఆయన ఒక కంటెస్టెంట్‌కు బహిరంగంగా మద్దతు తెలపడం వెనుక పరోక్షంగా రాజకీయ కోణం ఇమిడి ఉందనే చర్చ మొదలైంది.
పవన్ కల్యాణ్ అన్నయ్యగా నాగబాబును జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు సహజంగానే టార్గెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో భరణికి నాగబాబు బహిరంగంగా మద్దతు తెలపగానే, వైసీపీ క్యాడర్ ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. భరణికి కాకుండా మిగిలిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసి, ఆయన ఎలిమినేషన్ కావాలని కోరుకున్నారు.నాగబాబు ట్వీట్ వేసినప్పుడే, భరణి త్వరలోనే బయటకు వస్తారని, ఐదారు వారాల కంటే ఎక్కువ ఉండరంటూ ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలర్స్ అన్నట్టుగానే భరణి ఆరోవారంలో బయటకు వచ్చేయడం విశేషం.
మొత్తానికి, బిగ్ బాస్ హౌస్‌లో నాగబాబు మద్దతు పొందడం భరణికు అడ్వాంటేజ్ కంటే డిస్‌అడ్వాంటేజ్‌గానే మారిందనే చర్చ సోషల్ మీడియాలో బలంగా సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన బిగ్ బాస్ ఓటింగ్‌లో, ఒక రాజకీయ నాయకుడి బహిరంగ మద్దతు ఆ కంటెస్టెంట్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ఇది మొదటిసారి కావచ్చు. రాము రాథోడ్ కంటే తక్కువ ఓట్లు రావడంతోనే భరణి ఎలిమినేషన్ జరిగిందని నాగార్జున స్వయంగా ప్రకటించినప్పటికీ, ఈ ఓటింగ్ సరళి వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు భరణి ఎలిమినేషన్‌కు కారణమయ్యాయనే వాదన బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications