బాలయ్య సెకండ్ వెర్షన్ ఫార్ములా... బ్లాక్ బస్టర్
నందమూరి బాలకృష్ణ సినిమా కెరీర్ లో హిట్ సినిమాలకంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ బాలయ్య అంటే గుర్తుకొచ్చే సినిమాలు కొన్నివుంటాయి. ఆ సినిమాల పాత్రల్లో బాలకృష్ణను కాకుండా మరెవరినీ ఊహించుకోలేం. అంతగా ఆ చిత్రాల్లోని పాత్రలతో ఆయన మమేకమయ్యారు. ఒకప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చెబితే ఇప్పుడు సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి అని చెబుతున్నారు. ఈ సినిమాలన్నింటిలో
ఒక పోలిక కనపడుతుంది.
అదేమిటంటే.. పాత్రల ఎంపిక. ఈ సినిమాల్లో ఎక్కడా కుర్ర హీరోగా రొమాన్స్ పండించలేదు. వయసుకు తగ్గ పాత్రలే చేశారని చెప్పవచ్చు. సింహా, లెజండ్ సినిమాల్లో పెద్ద బాలకృష్ణ, అఖండలో అఘోరా, వీరసింహారెడ్డి పాత్రలన్నీ ఆయన ఇమేజ్ ను ఆసాంతం పెంచేశాయి. వీటిల్లో ఎక్కడా హీరోయిన్లతో రొమాన్స్ చేయలేదు. అలాంటి పాత్రలున్నప్పటికీ వాటికి ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంటుంది. యాక్షన్ హీరోగా బాలయ్యకున్న ఇమేజ్ ను ఇవన్నీ నిలబెట్టాయి. ఒకరకంగా చూస్తే ఇమేజ్ ను పెంచాయని చెప్పవచ్చు. కుర్ర హీరోగా చేసిన సినిమాలేవీ హిట్ అవలేదు. వాటితో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. బాలకృష్ణను తెలుగు ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన సినిమాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న భగవంత్ కేసరిలో శ్రీలీలకు తండ్రిగా కనిపిస్తున్నారు. దీన్నిబట్టి పాత్ర చిత్రణ ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం బాలయ్య 2.ఓ వెర్షన్ నడుస్తోందనే మాట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది. హిట్ చిత్రాల సెంటిమెంట్ ఇలాగే కొనసాగితే కచ్చితంగా భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే మాట వినిపిస్తోంది. ఆయన అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications