తన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికో చెప్పేసిన నందమూరి బాలకృష్ణ
నటసింహం నందమూరి బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తెలుగువారు నివసించే ఇతర ప్రాంతాల్లోను విపరీతమైన అభిమానులున్నారు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆరుపదుల వయసులో కుర్రాడిలా హుషారుగా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ యువ కథానాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అంతేకాదు.. అదిరిపోయే స్టెప్పులు కూడా వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ కార్యక్రమం బాలయ్యకు ఎందరో అభిమానులను సంపాదించిపెట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తవకుండానే తర్వాత సినిమాను లైనులో పెట్టారు. ప్రస్తుతం బాలయ్య 109, 110 చిత్రాల గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చర్చ నడుస్తోంది. బాబీతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

అయితే 109వ సినిమా ఎవరితో అనే విషయం మాత్రం తేలడంలేదు. రామ్ సినిమాతో బోయపాటి బిజీగా ఉన్నారు. ఆ సినిమా మొత్తం షూటింగ్ పూర్తయ్యేవరకు ఎదురుచూడాలని బాలయ్యబాబు నిర్ణయించుకున్నారు. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. బాలయ్య 109వ సినిమాను బాబీతో కాకుండా బోయపాటితోనే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రామ్ సినిమా మొత్తం షూటింగ్ పూర్తయి బోయపాటి వచ్చేవరకు ఎదురుచూస్తానని బాలకృష్ణ సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి రెండురోజులపాటు బోయపాటి-బాలకృష్ణ మధ్య చర్చలు నడిచినట్లు సమాచారం. బోయపాటి శ్రీనుకే తన మొదటి ప్రాధాన్యత అని బాలయ్య డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ సినిమా చేయాలన్నది ఆలోచిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. బాబీ ఈలోగా మరో సినిమా చేస్తారా? లేదంటే హీరో ఎవరైనా దొరుకుతారా? అనే విషయంలో స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications