unstoppable2: బాలకృష్ణ అడిగినదానికి అల్లు అరవింద్ సీరియస్ గా అన్నారా? సరదాగా అన్నారా?

తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకులుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడూ కలిసి నటించలేదు. తెలుగు సినిమా 75 సంవత్సరాల వేడుక సందర్భంగా కథానాయకులందరిమీద ఒక పాటను చిత్రీకరించిన సమయంలో మాత్రమే పాల్గొన్నారు. ఈ ఇద్దరు కథానాయకుల అభిమానుల మధ్య పోరు హోరాహోరీగా నడిచేది.

కథను బట్టి మల్టీస్టారర్ చేసేవారు

కథను బట్టి మల్టీస్టారర్ చేసేవారు

మొదటి తరం కథానాయకులైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటివారు ఎటువంటి భేషజాలకు పోకుండా కథను బట్టి మల్టీ స్టారర్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తర్వాత తరం కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎటువంటి మల్టీస్టారర్ చేయలేదు. కాకపోతే తర్వాత నాగార్జున-కార్తి, నాగార్జున-మోహన్ బాబు, వెంకటేష్-మహేష్ బాబు, వెంకటేష్- పవన్ కల్యాణ్, రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రాలు వచ్చాయి.

అభిమానులను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్న సినిమాలు

అభిమానులను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్న సినిమాలు

ఇప్పుడు రూపొందుతున్న సినిమాలన్నీ కథానాయకుల అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీస్తుండటంతో వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు మల్టీస్టారర్ సాహసాలు ఎవరూ చేయలేకపోతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్2 సీజన్, ఎపిసోడ్ 5కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతలుగా చెలామణి అవుతున్న అల్లు అరవింద్, డి.సురేష్ బాబును బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు.

తనకు, సురేష్ బాబుకు మధ్య ఉన్న అనుబంధం గురించి అల్లు అరవింద్ కు తెలుసని, కానీ తనతో సినిమా తీయడమే మీకు బ్యాలన్స్ గా ఉందని, ఎప్పుడు రూపొందిస్తున్నారని అల్లు అరవింద్ ను అడగ్గా.. చిరంజీవి-బాలకృష్ణ కలిసి చేసేలా సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. అయితే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ఎపిసోడ్ విడుదలైనప్పుడే స్పష్టత?

ఎపిసోడ్ విడుదలైనప్పుడే స్పష్టత?

అరవింద్ సరదాగా వ్యాఖ్యానించారా? లేదంటే ఈ కాంబినేషన్ లో నిజంగానే ప్రయత్నాలు చేస్తున్నారా? అనేది ఎపిసోడ్ విడుదలైనప్పుడే స్పష్టత రానుంది. ఇంటర్వ్యూ మధ్యలో వచ్చిన కె.రాఘవేంద్రరావును అల్లు అరవింద్ హాస్యమాడారు. కె.రాఘవేంద్రరావు బీఏ అంటే కె.రాఘవేంద్రరావు బొడ్డుమీద యాపిల్ అని పోల్చారు. తర్వాత న్యూటన్ యాపిల్ కింద పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టారని, తాను మాత్రం ఎక్కడ పడాలో కనిపెట్టానని దర్శకేంద్రుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+