వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హద్దు మీరారు: 'జగన్ సెల్ఫ్ గోల్, అవే మైనస్', ఎవరో.. ఇప్పటికే క్లారిటీ

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచార అంకం ముగుస్తోంది. 23వ తేదీన జరిగే ఉప ఎన్నిక కోసం సీఎం చంద్రబాబు చివరలో రెండు రోజులు విస్తృతంగా పర్యటించారు. వైసిపి అధినేత జగన్ పన్నెండు రోజులకు పైగా తిష్ట వేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచార అంకం ముగిసింది. 23వ తేదీన జరిగే ఉప ఎన్నిక కోసం సీఎం చంద్రబాబు చివరలో రెండు రోజులు విస్తృతంగా పర్యటించారు. వైసిపి అధినేత జగన్ పన్నెండు రోజులకు పైగా తిష్ట వేశారు.

బాబూ! అన్నీ ఆగిపోవాలా: శిల్పా కోడలు సవాల్, ఒత్తిడి చేస్తున్నారని సంచలనంబాబూ! అన్నీ ఆగిపోవాలా: శిల్పా కోడలు సవాల్, ఒత్తిడి చేస్తున్నారని సంచలనం

మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, వైసిపి నేతలు రోజా తదితరుల మధ్య మాటల యుద్ధం సాగింది. పెద్ద ఎత్తున మంత్రులు, టిడిపి నేతలు బ్రహ్మానంద రెడ్డి కోసం, వైసిపి నేతలు శిల్పా కోసం నంద్యాలలోనే తిష్ట వేశారు.

జగన్ సెల్ఫ్ గోల్

జగన్ సెల్ఫ్ గోల్

నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్, ఆ పార్టీ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. జగన్ భాష, ఆయన తీరు వైసిపికి మైనస్ అయ్యాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై జగన్, రోజాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవినేని వైసిపి సెల్ఫ్ గోల్ చేసుకుందన్నారు.

Recommended Video

Nandyal by-elections : Chandrababu Naidu holds Road Show, Watch Video
వర్షంలోనే జగన్ ప్రచారం

వర్షంలోనే జగన్ ప్రచారం

నంద్యాల ఉప ఎన్నికలను చంద్రబాబు, జగన్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ఇరు పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఆదివారం నంద్యాల పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో జగన్ ప్రచారం చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన తన ప్రచారాన్ని కొనసాగించారు. చాలామంది గొడుగులతో ప్రచార పర్వానికి హాజరయ్యారు.

నంద్యాలను వీడాలని ఈసీ

నంద్యాలను వీడాలని ఈసీ

బుధవారం ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. నాన్ లోకల్ నేతలు, ఎమ్మెల్యేలు సాయంత్రం ఆరు గంటల తర్వాత నంద్యాల నియోజకవర్గంలో ఉండవద్దని ఈసీ సూచించింది. ప్రచార పర్వం ముగిసినట్లు తెలిపింది. నేతలందరూ ఆరు గంటల వరకు ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రచార సభ గాంధీ చౌక్‌లో ముగిసింది.

ఇప్పటికే ఓటరుకు స్పష్టత.. పార్టీల్లో ఆందోళన

ఇప్పటికే ఓటరుకు స్పష్టత.. పార్టీల్లో ఆందోళన

ఎవరికి ఓటు వేయాలనే విషయమై నంద్యాల ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని చెప్పవచ్చు. అధికార టిడిపి అభివృద్ధి మంత్రమే తమను గెలిపిస్తుందని భావిస్తుండగా, హామీలు నెరవేర్చని చంద్రబాబు కారణంగా తాము గెలుస్తామని వైసిపి చెబుతోంది.

చంద్రబాబు వర్సెస్ జగన్, శిల్పా వర్సెస్ భూమా

చంద్రబాబు వర్సెస్ జగన్, శిల్పా వర్సెస్ భూమా

ఎన్నికల ప్రచారం చంద్రబాబు వర్సెస్ జగన్, భూమా వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డిలుగా కనిపించింది. జగన్‌ ప్రధానంగా చంద్రబాబునే టార్గెట్‌గా చేసుకుని ప్రచారం చేశారు. టిడిపి నేతలు, రెండు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు వైసిపి అధినేతకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అలాగే శిల్పా ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీలు పోటాపోటీగా మాటల యుద్ధానికి దిగాయి.

భూమా వదిలేసిన జగన్, బాబు మాత్రం ఇద్దర్నీ వదల్లేదు

భూమా వదిలేసిన జగన్, బాబు మాత్రం ఇద్దర్నీ వదల్లేదు

భూమా కుటుంబంపై జగన్ పెద్దగా విమర్శలు చేయలేదు. ఆయన ప్రధానంగా జగన్‌నే టార్గెట్ చేశారు. రోజా వంటి ఇతర వైసిపి నేతలు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలప్రియపై రోజా చేసిన డ్రెస్సింగ్ కామెంట్ వివాదాస్పదమైంది. దీనికి అఖిలప్రియ హుందాగా కౌంటర్ ఇచ్చారు. అది రోజా విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు మాత్రం తన పర్యటనలో జగన్, శిల్పా మోహన్ రెడ్డి ఇద్దర్నీ ఏకిపారేశారు.

హద్దు మీరిన మాటలు

హద్దు మీరిన మాటలు

జగన్, రోజా, శిల్పా చక్రపాణి రెడ్డి, టిడిపి నేతలు బోండా ఉమ తదితరులు హద్దు మీరి మాట్లాడినట్లుగా ఆరోపణలు వినిపించాయి. చంద్రబాబుపై జగన్ కాల్చివేత వ్యాఖ్యలు, మహిళలపై శిల్పా చక్రపాణి రెడ్డి, డ్రెస్సింగ్ పైన రోజా మాట్లాడటం వివాదాస్పదమైంది.

పరస్పరం ఫిర్యాదులు

పరస్పరం ఫిర్యాదులు

టిడిపి, వైసిపి నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు ప్యాంటీ వాహనంలో తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టిడిపి నేతలు ఈసీ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

గెలుపుపై ధీమా, ఆందోళన.. ఎవరు గెలవకున్నా నిరుత్సాహమే

గెలుపుపై ధీమా, ఆందోళన.. ఎవరు గెలవకున్నా నిరుత్సాహమే

నంద్యాలలో గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదే స్థాయిలో ఆయా పార్టీల్లో ఆందోళన కూడా నెలకొంది. పార్టీ మారిన కారణంగా దీనిని గెలవకుంటే టిడిపి ప్రతిష్ట మంటకలిసినట్లే. అలాగే, బెట్టుతో పోటీకి దిగి, 2019 ఎన్నికలకు ఇవే కీలకమని వైసిపి చెప్పింది. శిల్పా గెలవకుంటే 2019 ఎన్నికలకు ముందు వైసిపికి తీవ్ర నిరుత్సాహమని చెప్పవచ్చు. ఇక్కడ ముస్లీం, కాపు బలిజ తదితర ఓట్లు కీలకంగా మారాయి. ఆయా కుల సంఘాలు, గ్రూపులకు ఇరు పార్టీలు గాలం వేసే ప్రయత్నం చేశాయి.

English summary
With Nandyal bypoll promising to go down to the wire, TDP supremo and chief minister N Chandrababu Naidu is banking on Muslims and Balijas, who form a sizeable section of voters, to romp home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X