పెళ్లి రోజే చంద్రబాబు జైలుకు.: నారా భువనేశ్వరి కన్నీటిపర్యంతం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదివారం ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు, అభిమానులకు నిరాశే ఎదురైంది. చంద్రబాబు కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్ విధిస్తూ తీర్పు రావడంతో కోర్టులోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లి రోజైన సెప్టెంబర్ 10న ఇద్దరూ కలిసి అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. అంతకు ఒకరోజు ముందే శనివారంనాడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో భువనేశ్వరి ఒక్కరే శనివారం అమ్మవారి దర్శనానికి వెళ్లారు. పెళ్లి రోజైన ఆదివారం చంద్రబాబుతోపాటు ఆమె న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ వస్తుందని ఆశించినప్పటికీ.. కోర్టు రిమాండ్ విధించడంతో భువనేశ్వరి భావోద్వేగానికి గురై, కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చంద్రబాబు ఆమెను సముదాయించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. భువనేశ్వరితోపాటు లోకేశ్, బ్రాహ్మణి ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.
#WATCH | Andhra Pradesh former CM N Chandrababu Naidu brought to Rajahmundry Central Prison.
— ANI (@ANI) September 11, 2023
CM N Chandrababu Naidu was sent to judicial custody till September 23 in a corruption case yesterday. pic.twitter.com/tM3L0dEdw7
చంద్రబాబుకు రిమాండ్: ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం.. చంద్రబాబుకు సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు.
తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో ఆదివారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఉత్తర్వులు వెలువడిన అనంతరం చంద్రబాబును రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరంకు తరలించారు. అర్ధరాత్రి 1.16 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. చంద్రబాబును తరలించే రోడ్డు మార్గంలో 144 విధించి భారీ భద్రతతో ఆయనను తరలించారు. కాగా, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. పలు చోట్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications