బాల్యాన్ని గుర్తు చేసుకున్న నారా లోకేష్
International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. యోగాకు సంబంధించిన గతానుభవాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ పెట్టారు.
యోగా అనేది ఆసనాలు మాత్రమే కాదని, మనందరి జీవన విధానమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మనందరికీ క్రమశిక్షణ నేర్పేదని పేర్కొన్నారు. తాను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో యోగా చేయించేవారని, దీనికోసం ఉదయమే నిద్ర లేపేవారని అన్నారు.

ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడినని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అదే క్రమశిక్షణ, పట్టుదల అందరిలో ఉందని, దీనిని ఎవరూ విస్మరించకూడదని హితవు పలికారు. ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు.
వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాంక్షలను తెలియజేశారు. యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. రోజువారీ జీవితంలో యోగా ఎలాంటి సానుకూల దృక్పథాన్ని పెంపొందింపజేస్తుందో ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
శరీరం ఆత్మ రెండింటిపై యోగా ఎంతగానో సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రశాంతతను పెంపొందించడానికి సహాయపడుతుందని చెప్పారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు- మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి కట్టుబడి ఉందామని జగన్ పిలుపునిచ్చారు.
యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి, వీటన్నిటిపైనా గడచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారని కితాబిచ్చారు.
ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నారా లోకేష్ నిలిపారు మోదీ పేర్కొన్నారు. యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని, యోగాంధ్ర కార్యక్రమంపై విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు.
చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించిందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారని అన్నారు.












Click it and Unblock the Notifications