మీకో చట్టం, విపక్షాలకి మరో చట్టమా? బండారు సత్యనారాయణ అరెస్ట్ పై నారా లోకేష్!!

అనకాపల్లి జిల్లాలో టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రెండు కేసులు కూడా నమోదు చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు తొలత ప్రయత్నించిన పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి తన ఇంటి తలుపులు తెరవక పోవడంతో, ఇంటి తలుపులు బద్దలు కొట్టి నోటీసులు అందజేశారు.

41 ఏ, 41 బి సెక్షన్ ల కింద నోటీసులు ఇచ్చి మరీ ఆయనను అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం లో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు . మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు మంత్రి ఆర్కే రోజా పై అనుచిత వ్యాఖ్యలుచేసిన కేసులో అరెస్ట్ చేశారు.

Nara Lokesh lashed out at ycp govt on the arrest of Bandaru Satyanarayana murthy!!

రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మహిళా కమిషన్ కూడా స్పందించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ఇక బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. బీసీ నేతలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న వారిపై కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.

కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బండారు సత్యన్నారాయణ మూర్తి అరెస్టుపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.వైకామ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలంతా కూసే రోత బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి పోలీసులు? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారని మండిపడ్డారు.

వైకామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకి మరో చట్టమా? ఇదేం అరాచక పాలన? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. బీసీ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+