లోకేష్ భవిష్యత్ పై చంద్రబాబు కీలక నిర్ణయం - మరి పవన్..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటుగా కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ సారి మంత్రివర్గం లో పవన్..లోకేష్ చేరిక పైన కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ తాను కేబినెట్ లో చేరకుండా..తన పార్టీ వారికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక..లోకేష్ పార్టీ - ప్రభుత్వంలో నిర్వహించే పాత్ర పైన స్పష్టత వచ్చింది.

చంద్రబాబు కసరత్తు
చంద్రబాబు మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసారు. తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. మూడు పార్టీలతోనూ చర్చలు చేసి..తన మంత్రివర్గానికి తుది రూపు ఇస్తున్నారు. అధికారుల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ప్రాంతీయ - సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో చేరితో ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలక శాఖ ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ, ఇప్పటి వరకు పవన్ మంత్రి అవతారా లేదా అనేది స్పష్టత రాలేదు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం తరువాతనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.

Nara Lokesh likely to hold key port folios in Chandra Babu new cabinet Pawan to take final decision

మంత్రిగా లోకేష్
ఇక..నారా లోకేష్ బాధ్యతలు ఏంటనేది పార్టీలో చర్చ సాగుతోంది. లోకేష్ ఈ సారి మంత్రివర్గంలో చేరకుండా ప్రభుత్వం - పార్టీకి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారని పార్టీలో చర్చ సాగింది. కానీ, లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం పాలనా పరంగా అనుభవం..ప్రస్తుతం ప్రజల్లో కొత్త ప్రభుత్వం పైన భారీ అంచనాలు ఉండటంతో..లోకేష్ కు కీలక శాఖలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ ఐటీ, పంచాయితీరాజ్ శాఖలు పర్యవేక్షించారు.

పవన్ నిర్ణయం ఏంటి
అధికారంలోకి వస్తే కొత్త కంపెనీలు, ఉపాధి కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. దీంతో..లోకేష్ కు తిరిగి ఐటీతో పాటుగా పంచాయితీ రాజ్ లేదా మున్సిపల్ శాఖల్లో ఒకటి అప్పగించే ఛాన్స్ ఉంది. గతంలో ఐటీ మంత్రిగా పని చేసిన సమయంలో అమరావతి పరిధిలో ఐటీ సంస్థలు తీసుకొచ్చేందుకు లోకేష్ పని చేసారు. ఇక..అమరావతి నిర్మాణం ఈ సారి ముఖ్యమైన లక్ష్యం కావటంతో ఈ బాధ్యతలు సైతం లోకేష్ కు అప్పగిస్తారని భావిస్తున్నారు. గతంలో అమరావతి వ్యవహారాలు నారాయణ పర్యవేక్షించారు. దీంతో..లోకేష్ మంత్రివర్గంలో చేరటం ఖాయం అయినా..పవన్ చేరిక పైన స్పష్టత వచ్చిన తరువాతనే ఈ ఇద్దరికి ప్రాదాన్యత శాఖల కేటాయింపు పైన చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+