చంద్రబాబును గెలిపిద్దాం: 2019కి సిద్ధమౌతున్న లోకేష్!

లోకేష్ ఆదివారం ఓ ప్రయివేటు హోటల్లో వారితో ప్రత్యేకంగా సమావేశమై విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించడమే మన తొలి కర్తవ్యమని, మనం 2019 ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతామని హితబోధ చేశారట.
ఈ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉన్న కొందరు యువనేతల గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి? వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి? అనే అంశంపై వారు చర్చించారు.
వచ్చే ఎన్నికల్లోనే పోటీ చేసే తమ నియోజకవర్గాల పైన దృష్టి సారించాలనే అంశంపై మాట్లాడారు. ఇక 2019 ఎన్నికలకు సిద్ధమౌతున్న వారు ఎన్నికల్లో అందరికీ సహకరించి నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. లోకేష్ వ్యాఖ్యల ద్వారా అతను ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయం సస్పెన్స్‌గా మారినట్లే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications