కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ టీడీపీలో నాయకత్వానికీ, క్యాడర్ కూ మధ్య, అలాగే అధిష్టానానికీ, ఎమ్మెల్యేలకూ మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న మంత్రి నారా లోకేష్ (nara Lokesh).. ఇవాళ ఓ అనూహ్య ప్రకటన చేశారు. ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లికి ఆహ్వానం అందుకున్న లోకేష్.. స్వయంగా వెళ్లి ఆమెను ఆశీర్వదించడమే కాకుండా ఆమెకు అరుదైన పెళ్లి కానుక కూడా అక్కడే ప్రకటించేశారు. దీంతో అవాక్కవడం సదరు ఎమ్మెల్యే వంతయింది.

గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తన కుమార్తె పెళ్లికి నారా లోకేష్ కు ఆహ్వానం ఇచ్చారు. దీంతో లోకేష్ పెళ్లికి హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. అంతటితో ఆగకుండా వెళ్తూ వెళ్తూ పెళ్లి కూతురిని ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వస్తోందని, ఎమ్మెల్యే టికెట్ తీసుకుని పోటీకి సిద్దంగా ఉండాలని ఆమెకు లోకేష్ సడన్ గా చెప్పేశారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల సహా అంతా అవాక్కయ్యారు.

Nara Lokesh Offers MLA Ticket to Dhulipalla Narendra s Daughter at Her Wedding

అంతలోనే కోలుకుని లోకేష్ నా సీటుకే ఎర్త్ పెడుతున్నారంటూ ధూళిపాళ్ల నరేంద్ర చెప్పుకోవడం వినిపించింది. అయితే లోకేష్ ఆఫర్ వెనుక మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం కేంద్రం.. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా చేపడుతోంది. ఇందులో ఏపీలో నియోజకవర్గాలు 50 శాతం పెరకబోతున్నాయి. దీంతో పలు కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పాటవుతున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుతో ఎమ్మెల్యే కుమార్తె వంటి వారికి అవకాశాలు లభించబోతున్నాయి. దీంతో లోకేష్ ఆ ఉద్దేశంతో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+