రంగస్థలం సినిమాపై నారా లోకేష్ స్పందన, రామ్ చరణ్ తేజ థ్యాంక్స్
అమరావతి: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ నటుడిగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ప్రశంసలు కురిపించార. ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు.
ఈ సినిమాను చూసినట్లు పేర్కొన్నారు. మాకు రంగస్థలం లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు రామ్ చరణ్, సుకుమార్‌కు ధన్యవాదాలు అని లోకేష్ పేర్కొన్నారు.

సినిమా చూసిన తర్వాత చాలాసేపటి వరకు ఆ పాత్రలు మనతోనే ఉండిపోతాయన్నారు. గ్రేట్ వర్క్ గాయ్స్ అంటూ పేర్కొన్నారు.
నారా లోకేష్ ట్వీట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పేస్‌బుక్ ద్వారా స్పందించారు. థ్యాంక్యూ నారా లోకేష్ గారు అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications