వరవర రావుకు మెరుగైన వైద్యం అందించండి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌కు లోకేశ్ వినతి..
ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని సర్ జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వరవర రావుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు ట్విట్టర్‌లో విన్నవించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయనను ఇటీవల ఆస్పత్రికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్యం అందజేయాలని లోకేశ్ మహారాష్ట్ర సీఎం థాకరేను కోరారు.
ప్రధాని మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణల కింద 2018లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అతని భార్య హేమలత పదే పదే ప్రస్తావించారు. ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. ఇటీవల సీఎం జోక్యం చేసుకోవాలంని హరగోపాల్ లేఖ కూడా రాశారు.

Recommended Video
వరవర రావు ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన జేజే ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని వరవర రావు భార్య హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె వీడియో కాల్ కూడా మాట్లాడారు. ఆ సమయంలో భర్త పరిస్థితిని చూసి ఆందోళన చెందారు. హేమలత, హరగోపాల్ విన్నవించడంతో.. వరవర రావును జేజే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications