నరేష్-పవిత్రా లోకేష్ నుంచి ఊహించని అప్ డేట్
Naresh -Pavitra Lokesh:నరేష్-పవిత్రా లోకేష్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత మళ్లీ వివాహం చేసుకుంటామని ప్రకటించారు. అలాగే వారిద్దరి నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఇటీవల కాలంలో పవిత్ర, నరేష్ వివాహం చేసుకుంటున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అది నిజమైన వీడియో కాదని, మళ్లీ పెళ్లి సినిమాలో వారిద్దరూ పెళ్లిచేసుకున్నట్లు నటించారని తేలింది. తమ ప్రేమను పెళ్లిగా మారుస్తామంటూ ఆ వీడియోనే గతంలో విడుదల చేశారు.
నరేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్ర టీజర్‌ను ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నారు. ఈమేరకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం కొనసాగనుంది. ఈ సినిమాకు సంబంధినంచి నరేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని, పూర్తి కుటుంబ కథానేపథ్యమున్న సినిమా అని చెప్పారు. జయసుధ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తుండగా.. అరుల్ దేవ్ నేపథ్య సంగీతాన్ని అందించారు. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోంది.












Click it and Unblock the Notifications