సంచలనం: గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు కాకినాడ కనుమరుగు!? నాసా హెచ్చరిక..

రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత నగరం కాకినాడ కనుమరుగు కానుందా? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేసిన తాజా పరిశోధన ప్రకారం.. మన దేశంలో ముంబై, మంగళూరుతోపాటు కాకినాడకు కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రభా

Recommended Video

    త్వరలో కాకినాడ కనుమరుగు? Kakinada is at High Risk

    అమరావతి: రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత నగరం కాకినాడ కనుమరుగు కానుందా? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేసిన తాజా పరిశోధన ప్రకారం.. మన దేశంలో ముంబై, మంగళూరుతోపాటు కాకినాడకు కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తప్పదట.

    ఈ మేరకు నాసా చేసిన హెచ్చరిక భారత తీర ప్రాంత నగరాలను వణికిస్తోంది. గ్లోబల్ వర్మింగ్(భూతాపం) కారణంగా అంటార్కిటికాలోని మంచు ఫలకాలు కరగడం వల్ల ప్రపంచంలోని 293 ప్రధాన పోర్టు నగరాలకు ముప్పు వాటిల్లనుందని నాసా టూల్ కిట్ జీఎఫ్‌ఎం ద్వారా వెల్లడైంది.

    NASA tool predicts that even Kakinada is at High Risk

    మన దేశంలో అయితే.. మహారాష్ట్రలోని ముంబయి, కర్ణాటకలోని మంగళూరుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తదితర తీర ప్రాంతాలకు ఎక్కువ ముప్పు ఉన్నట్లు నాసా పరిశోధన వెల్లడించింది. ఇప్పటికే కాకినాడలోని ఉప్పాడలో సముద్రం ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

    జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించిన ఈ అధ్యనం వివరాల్లో... భారత తీర ప్రాంత నగరాలకు ముప్పు వెంటనే రావచ్చు లేదా ఆలస్యంగా రావచ్చు. కానీ, ఎప్పటికైనా ముంపు ప్రమాదం తప్పదని నాసా పేర్కొంది.

    వచ్చే వందేళ్లలో సముద్ర మట్టం ఎంత స్థాయిలో పెరగనుందో కూడా నాసా పరిశోధకులు అంచనా వేశారు. రానున్న రోజుల్లో కాకినాడలో 15.16 సెం.మీ, మంగళూరులో 15.98 సెం.మీ, ముంబయిలో 15.26, న్యూయార్క్‌లో 10.65 సెంటీమీటర్లు చొప్పున సముద్ర మట్టం పెరుగుతుందట.

    మరోవైపు గ్లోబల్ వార్మింగ్ ప్రభావానికి మంచు ఫలకాలు కరిగిపోవడం వల్ల మన దేశంలో ముందుగా ముంపునకు గురయ్యే మొదటి పది నగరాల్లో మంగళూరు, ముంబయి, కాకినాడ ఉన్నాయని 'ఇండియా టైమ్స్' కూడా ఒక కథనంలో పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+