టీడీపీకి టాలీవుడ్ సపోర్ట్ ? ఆర్జీవీ వ్యూహానికి కౌంటర్ మూవీ ! నిర్మాత నట్టికుమార్ కామెంట్స్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య వ్యూహప్రతివ్యూహాలు సాగుతున్నాయి. ఇదే క్రమంలో విపక్ష నేతలు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ వ్యూహం చిత్రంతో ముందుకొస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు నారా లోకేష్ హైకోర్టులో ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ కే చెందిన మరో దర్శక నిర్మాత నట్టికుమార్ ఇవాళ ఈ మొత్తం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాంగోపాల్ వర్మ ఓ డైరెక్టర్ మాత్రమేనని, వైసీపీ వాళ్లు ఇచ్చే డబ్బులతో వ్యూహం సినిమా తీశాడని నట్టికుమార్ తెలిపారు.డబ్బులిచ్చారు కాబట్టి ఆర్జీవీకి వైసీపీపై సానుభూతి ఉంటుందన్నారు. కానీ సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. ఆర్జీవీ వ్యూహం సినిమాను తాను చూస్తానని, వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా తాను మరో సినిమా తీస్తానన్నారు.ఇందులో రఘురామకృష్ణంరాజుపై చిత్ర హింసలు,వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది, వైసీపీ అరాచకాలపై సమాధానాలు ఉంటాయన్నారు.

జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉందని నట్టికుమార్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమ మొత్తం టీడీపీ వైపు ఉందని, ప్రస్తుతం సినీ రంగం భయంతో ఉందని నట్టికుమార్ వెల్లడించారు. త్వరలో అందరూ టీడీపీకి మద్దతుగా వస్తారన్నారు. రాష్ట్ర ప్రజల బాగుకోసం తాను టీడీపీని సపోర్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో చంద్రబాబుని కలిసి ప్రత్యక్ష రాజకీయాలపై కార్యచరణ ప్రకటిస్తానని నట్టికుమార్ పేర్కొన్నారు.
విశాఖలో సినీ రంగానికి ప్రభుత్వ స్టూడియో నిర్మాణం కావాలని లోకేష్ ను అడిగానని, సినిమా హబ్ గా విశాఖను తీసుకువస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకి 130నుంచి 150 సీట్లు వస్తాయని, వైసీపీ 29సీట్లకు పరిమితం అవుతుందని నట్టికుమార్ జోస్యం చెప్పారు. కాపులపైన, రంగాపైన ప్రేమ ఉంటే నాలుగున్నరేళ్లలో అమర్నాథ్, పేర్ని నాని, అంబటి ఆయన హత్యపై ఎందుకు విచారణ చేపట్టలేదని నట్టికుమార్ ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఎందుకు మాట్లాడలేదని అడిగారు.
-
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?












Click it and Unblock the Notifications