పవన్ కళ్యాణ్‌పై నేచురల్ స్టార్ నాని సంచలన పోస్ట్; ప్రచారం చేయనున్న టాప్ ప్రొడ్యూసర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రమంతా ఒకెత్తు అయితే, పిఠాపురం ఒకెత్తు అన్నట్టుగా రాజకీయం మారింది. ఈసారి పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి ఒక వీడియోని రిలీజ్ చేసి తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ దన్నారు. జనమే జయమని నమ్మే జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించాలన్నారు.
పవన్ కళ్యాణ్ కోసం నేచురల్ స్టార్ నాని ట్వీట్
ఇక ఇదే సమయంలో జనసేన పార్టీకి తన మద్దతును ప్రకటిస్తున్నట్టు నేచురల్ స్టార్ నాని కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.నేచురల్ స్టార్ నాని తాను పెట్టిన పోస్టులో పవన్ కళ్యాణ్ మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబసభ్యుడిగా మీరు కోరుకున్న విషయాన్ని సాధించాలని నేను ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ప్రముఖులు
మీ వాగ్దానాలు అన్నింటిని నిలబెట్టుకోవాలి అని కోరుకుంటున్నానని, మీకు ఎంతో మంది ప్రేమాభిమానాలు తోడుగా ఉన్నాయని నాని తెలిపారు. నా మద్దతు మీకే.. ఆల్ ది బెస్ట్ సర్ అని నాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఒక్క నాని మాత్రమే కాదు, హీరో రాజ్ తరుణ్, సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ప్రొడ్యూసర్లు, నటులు పవన్ కళ్యాణ్ కు తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు.
ఇప్పటికే పిఠాపురంలో సెలబ్రిటీల ప్రచారం
ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వారంతా కోరుకుంటున్నారు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుకుంటుంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే సినీ, బుల్లితెర సెలబ్రిటీలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. హైపర్ ఆది, జానీ మాస్టర్, హీరోయిన్ నమిత, మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు.
పవన్ కోసం యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఎన్నికల ప్రచారం
ఇక యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ఒక కార్యక్రమంలో తమ మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉంటుందని నాగ వంశీ స్వయంగా తెలిపారు. మొత్తంగా ఈసారి జనసేనని, పవన్ కళ్యాణ్ ను గెలిపించడానికి సినీ పరిశ్రమ, పవన్ కోసం రంగంలోకి దిగిందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications