పెళ్లయిన కొత్తలోనే నయనతార.. ఇలా చేసిందేమిటి??
కోలీవుడ్ ప్రేమజంట నయనతార-విఘ్నేశ్ శివన్ మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. రజనీకాంత్, షారుక్‌ఖాన్, కార్తీ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏడుకొండలపై కొలువైన ఆ దేవదేవుడు వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నూతన దంపతులు తిరుమలకు వచ్చారు.
తిరుమలకు వచ్చిన నయనతార శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనంలో ఒక తప్పుచేసి వివాదంలో ఇరుక్కున్నారు. స్వామి కొలువుదీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు అత్యంత పవిత్రమైనవి. స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లోనే సాగుతుంది. అటువంటి మాడవీధుల్లో నయనతార చెప్పులు ధరించి నడిచి వివాదంలో పడ్డారు.

నయనతారతోపాటు ఉన్న ఆమె భర్త విఘ్నేశ్ శివన్, వారితోపాటు వచ్చినవారంతా చెప్పుల్లేకుండా నడిచారని, నయనతార ఒక్కరే చెప్పులేసుకొని నడిచారంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. నయనతార గారు.. వివాహమైన కొత్తలోనే అలా చెప్పులేసుకొని తిరుమల స్వామివారి వద్ద అపవిత్రానికి పాల్పడ్డారు. ఆయన్ను క్షమాపణ కోరుకోండి.. మీ కొత్త దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వివాహమైన కొత్తలోనే నయనతార వివాదంలో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇప్పటికే నయనతార తన వివాహానికి తెలుగువారెవరినీ పిలవలేదంటూ విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఆమె చిన్నచూపేనంటూ ఫిల్మ్‌నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే మోస్ట్ ఎలిజబుల్ ప్రేమజంటగా ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు ఒక్కటయ్యారంటూ అందరూ ఆనందిస్తున్న సమయంలో ఇటువంటి విమర్శలు రావడం సహజమేనంటూ ఆమె టీమ్ వాటిని తిప్పి కొడుతోంది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications