Nayanthara: బాలీవుడ్ లో నయనతారకు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో గోల్డెన్ ఛాన్స్!!
అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమా సూపర్ హిట్ కావడంతో లేడీ సూపర్ స్టార్ నయనతార కోసం ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు పోటీ పడుతున్నారు. దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉన్న నయనతార కోలీవుడ్, టాలీవుడ్ లతోపాటు ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన క్రేజ్ ను కొనసాగించనుంది.
జవాన్ హిట్ తో బాలీవుడ్ చూపు ఇప్పుడు నయనతార పై పడింది. జవాన్ తరువాత ఇంతవరకు మరో హిందీ సినిమాకు నయనతార ఇప్పటివరకు ఒప్పుకున్నది లేదు. అయితే ఆమెకు ఆఫర్ల వరద కురుస్తోంది. ప్రస్తుతం ఒక బంపర్ ఆఫర్ నయనతారకు వచ్చినట్టు తెలుస్తోంది.బాలీవుడ్లో మంచి పేరు ఉన్న దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి కొత్త సినిమాలో నయనతార నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అలియా భట్, రణవీర్ సింగ్ జంటగా నటించే ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం నయనతారను తీసుకోవాలని సంజయ్ లీలా బన్సాలి భావిస్తున్నారని సమాచారం. అయితే బాలీవుడ్లో మంచి పేరున్న సంజయ్ లీలా బన్సాలి తీసిన సినిమాలు దాదాపు సూపర్ డూపర్ హిట్ లనే చెప్పాలి. రామ్ లీలా, బాజీరావు మస్తానీ మరియు పద్మావత్ వంటి చిత్రాలను నిర్మించిన సంజయ్ లీలా బన్సాలి బైజు బావ్రా సినిమాను తీయనున్నారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో సంజయ్ లీలా బన్సాలి ని నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసిన నేపథ్యంలోనే బైజు బావ్రా సినిమాలో నయనతార నటిస్తారన్న చర్చ జరుగుతుంది.
కోలీవుడ్, టాలీవుడ్ లలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే దర్శకులు నయనతారకు తొలి ప్రాధాన్యతను ఇస్తారు. ఏ సినిమా చేసినా నయనతార తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లోనే ఉంటుంది అంటే నమ్మి తీరాల్సిందే. నయనతార రెమ్యూనరేషన్ తాజాగా 10 కోట్లు దాటినట్టు సమాచారం. తాజాగా జవాన్ వల్ల బాలీవుడ్ ఫోకస్ నయనతారపై పడింది.












Click it and Unblock the Notifications