Nayanthara: ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో నయనతారకు భారీ డిమాండ్!!
లేడీ సూపర్ స్టార్ నయనతార కోసం ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు పోటీ పడుతున్నారు. దక్షిణాదిలో నయనతారకు ఉన్న క్రేజే వేరు. కోలీవుడ్, టాలీవుడ్ లలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే దర్శకులు మొదటి ప్రాధాన్యత నిచ్చేది నయనతారకే. లేడీ సూపర్ స్టార్ నయనతార రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లోనే ఉంటుంది అంటే నమ్మి తీరాల్సిందే. నయనతార రెమ్యూనరేషన్ తాజాగా 10 కోట్లు దాటినట్టు తెలుస్తుంది.
సినీరంగంలోకి ఎంతో మంది బ్యూటీలు వచ్చినప్పటికీ నయనతారకు పోటీగా నిలబడే హీరోయిన్ కచ్చితంగా లేరనే చెప్పొచ్చు. నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆమెకు ఆల్టర్నేటివ్ గా దర్శకులకు కనిపిస్తున్న హీరోయిన్ మాత్రం ఎవరూ లేరని చెప్పాలి. అంతగా నయనతార సినీ ఇండస్ట్రీలో స్థానం దక్కించుకుంది. నయనతార సక్సెస్, ఫెయిల్యూర్ అన్న వాటితో సంబంధం లేకుండా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఇక తాజాగా బాలీవుడ్ లోకి షారుక్ ఖాన్ ప్రధాని పాత్రలో వచ్చిన సినిమా జవాన్ లో నటించిన నయనతార నటనకు బాలీవుడ్ దర్శకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం లేడీస్ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక ఈ చిత్రం నయనతార యొక్క బాలీవుడ్ ఆరంగేట్రం.
అయితే నయనతార మొదటి సినిమానే బాలీవుడ్ లో అద్భుతమైన విజయం సాధించడంతో, ఇప్పుడు బాలీవుడ్ లో నయనతార కోసం దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది నిర్మాతలు తమ రాబోయే ప్రాజెక్టులలో నటించాలని లేడీ సూపర్ స్టార్ నయనతారతో చర్చలు జరుపుతున్నారు. అయితే నయనతార మాత్రం బాలీవుడ్లో వస్తున్న ఆఫర్లను ఆచితూచి ఎంచుకుంటున్నారు.
ఇప్పటికే నయనతార అనేక సినిమాలతో బిజీగా ఉండగా, ఇప్పుడు బాలీవుడ్ లోను నయనతార కోసం సినిమా ఆఫర్లు సిద్ధంగా ఉండటంతో నయనతార ముందు ముందు బాలీవుడ్ లో ఎటువంటి సినిమాలలో కనిపిస్తారు? ఎవరి సరసన నటిస్తారు? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications