పవన్ ను ఒప్పించే బాధ్యత బాలయ్యదే - దెబ్బకి థింకింగ్ మారిపోవాలంతే..!!
నందమూరి - పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం న్యూ ఇయర్ గిఫ్ట్. అటు సినీ - ఇటు పొలిటికల్ ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తున్న సమయం. ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా ఏపీ పాలిటిక్స్ లో మంచి కిక్కు ఇచే షోకు ప్లాన్ రెడీ అయింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా అన్ స్టాపబుల్ షో కు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావటం ఖాయమైందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేశ్ ద్వారా రాజకీయంగా.. ఇటు సినీ సెలబ్రెటీల ద్వారా బాలయ్య ఈ అన్ స్టాపబుల్ షో ఫుల్ ఫ్యాక్డ్ ఎంటర్ టైనర్ గానే కాదు అంతకు మించి అన్నట్లుగా మార్చేసారు. ఇక, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఈ షోకు వస్తుండటంతో బాలయ్య - పవన్ కాంబినేషన్ లో ఈ షో ఎలా రాబోతుందనేది మరింత ఆసక్తి పెంచుతోంది.

బాలయ్య - పవన్ కాంబినేషన్ లో తొలి సారిగా..
బాలయ్య హోస్ట్ గా ఆహా వేదికగా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షో కు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ షో సెకండ్ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ తో బాలయ్య చాలా సరదాగా ఎపిసోడ్ ను రన్ చేసారు. పొలిటికల్ గా సీరియస్ .. చంద్రబాబు కాలేజీ రోజులు..లోకేష్ తో సరదా ముచ్చట్లతో భారీ రేటింగ్ సంపాదించారు. ఆ తరువాత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలను అదే తరహాలో ఆకట్టుకొనే అంశాలను ప్రస్తావిస్తూ సందడి చేసారు. తరువాత ఎపిసోడ్ లో లెజెండరీ డైరెక్టర్, నిర్మాతలు అయిన రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబులు వచ్చారు. ఇక ఈ వారం టెలికాస్ట్ అవనున్న షోలో పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ అయిన ప్రభాస్ మరియు హీరో గోపిచంద్ రానున్నారు. ఓటీటీ లోనే రికార్డులు తిరగ రాస్తున్న ఈ షో కోసం పవన్ కల్యాణ్ రానున్నారనే వార్త షేక్ చేస్తోంది. ఈ నెల 27న దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.

పొత్తులపై పవన్ తో బాలయ్య చెప్పిస్తారా..
ఇప్పుడు కొత్త సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. బాలయ్య నిర్వహిస్తున్న షో కు రానున్నారనేది ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. అయితే, సినిమాలతో పాటుగా అన్నయ్య చిరంజీవితో అనుబంధం గురించి బాలయ్య ఏం చెప్పిస్తారనేది ఆసక్తి కరం. సినిమాలతో పాటుగా రాజకీయాల గురించి బాలయ్య జనసేనానితో ఏం చెప్పించబోతున్నారనేది మరింత ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో ఇప్పుడు పవన్ కల్యాణ్ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బాలయ్య హీరో మాత్రమే కాదు. టీడీపీ ఎమ్మెల్యేగా.. చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్న వారిలో తొలి వరుసలో ఉన్నారు. ఈ ఎపిసోడ్ ద్వారా పవన్ తో పొత్తుల సంగతి బాలయ్య చెప్పించలరా..రాజకీయంగా వ్యూహాత్మకంగా వెళ్తామని చెబుతున్న పవన్ ఆ వ్యూహాలపై సంకేతాలు ఇస్తారా అనేది మరో ఆసక్తి కర చర్చ. చంద్రబాబు ఈ షో ద్వారా ఎంతో కాలంగా తన మనసులో దాచుకున్న రాజకీయ అంశాలను బయట పెట్టారు. అదే విధంగా పవన్ తోనే పరోక్షంగా అయినా బాలయ్య చెప్పిస్తారా అనేది చూడాలి.

ఇద్దరు స్టార్ లు ఒకే వేదికపై..
బాలయ్య - పవన్ ఒకే వేదికపైకి వస్తే ఫ్యాన్స్ జోష్ ఇక అన్ స్టాపబుల్. ఈ షో అదిరిపోవాల్సిందే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇద్దరి హీరోల అభిమానులు చాలా ఎక్సైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఈ షో పైన అధికారికంగా ప్రకటన చేసిన తరువాత షూటింగ్ పూర్తి చేసి..డిసెంబర్ న్యూ ఇయర్ స్పెషల్ గా ప్రసారం చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ తో పాటుగా దర్శకుడు త్రివిక్రమ్ ను ఈ షోకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తో త్రివిక్రమ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా పవన్ షో కు రావటం కు సంబంధించి స్పష్టత ఇచ్చి ఇవ్వనట్లుగా ఒక క్లూ తో ఆహా గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. దీంతో పాటుగా నాగవంశీ కూడా డిసెంబర్ 27న సిద్దంగా ఉండండి ఆహా వేదికగా బిగ్ స్మాషింగ్ బ్లాస్ట్ రానుందంటూ ట్వీట్ చెయ్యడంతో ఇక పవర్ స్టార్ బాలయ్య షోకు వస్తున్నారని ఫ్యాన్స్ దాదాపు ఫిక్స్ అయిపోయారు.












Click it and Unblock the Notifications