టీడీపీ రెండో జాబితాలో ఆ సీట్లు రిజర్వ్: అమిత్ షా ముద్ర

TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు అధికారికంగా వెల్లడించారు.

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు కొనసాగించడం, షరతులకు ఓకే చెప్పిన తరువాతే ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు విషయంపై చర్చించారు. అవి ఫలించాయి.

NDA alliance parties to meet on March 16

ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టాయి. ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించబోతోన్నాయి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నాయి.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అటు బీజేపీ కూడా శరవేగంగా పావులను కదుపుతోంది. ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది. దీనికోసం ఈ నెల 16వ తేదీన ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో ఢిల్లీలో ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించబోతోంది.

తమ కూటమిలోకి టీడీపీ చేరిన తరువాత ఎన్డీఏ ఏర్పాటు చేయనున్న తొలి సమావేశం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కూ ఆహ్వానం అందింది. భాగస్వామ్య పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ భేటీకి హాజరవుతారు.

ఈ భేటీ తరువాతే తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల అయ్యే అవకాశం ఉంది. సీట్ల పంపకాలపై అమిత్ షా, జేపీ నడ్డా షరతులను విధించిన నేపథ్యంలో వారి అనుమతి తీసుకున్న తరువాతే చంద్రబాబు దీన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు. బీజేపీకి కేటాయించదలిచిన లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన వాటిని ఆయన విడుదల చేస్తారు.

బీజేపీ అడిగినట్లుగా చెబుతున్న ఆరు లోక్‌సభ స్థానాలు.. అరకు, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఏలూరు, నర్సాపురం/విశాఖపట్నం, జనసేకు ఇవ్వదలిచిన రెండు లోక్‌సభ స్థానాలు.. కాకినాడ, అనకాపల్లి స్థానాలను టీడీపీ మినహాయించే అవకాశం ఉంది. ఆయా చోట్ల బీజేపీ, జనసేన పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్దులను బరిలోకి దింపుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+