చంద్రబాబు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన వయసుకు మించి, శక్తికి మించి శ్రమిస్తున్నారు. నిస్సందేహంగా నేటి యువతకు అది ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది. జిల్లాల పర్యటనల్లో గంటల తరబడి నిలబడటంతోపాటు అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు. ఏపీలో ఈసారి పార్టీని అధికారంలోకి తేవడంతోపాటు తెలంగాణలోపదుల సంఖ్యలో సీట్లు సాధించి నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

లక్ష్యం దిశగా పయనిస్తోన్న చంద్రబాబు
లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తోన్న చంద్రబాబు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని, వాటిని సరిదిద్దుకుంటే చాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ వేడులకు హాజరైన చంద్రబాబు అక్కడ ప్రసంగించిన వీడియోలకంటే ISB ప్రతినిధులు చంద్రబాబు గురించి మాట్లాడినవే హైలైట్ అయ్యాయి.
చంద్రబాబు విజన్ గురించి, ISBకి ఆయన అందించిన ప్రోత్సాహం తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. తటస్తంగా ఉండేవారిని కూడా ఇవి ఆకర్షించడంతోపాటు చంద్రబాబు మీద గౌరవ భావం కలిగించేలా ఉన్నాయి.
ఈ చిన్న లాజిక్ ఎక్కడ మిస్సవుతున్నారు?
అయితే ఇక్కడే చిన్న తప్పు జరిగింది. మనం చేసిన మంచి పనుల గురించి ఎదుటివారు చెబితే బాగుంటుంది కానీ మనం చెప్పుకోకూడాదు. అయితే చంద్రబాబు ఈ చిన్న సూత్రాన్ని ఎలా మరిచిపోతున్నారో అర్థం కాకుండా ఉంది.
40 సంవత్సరాల పైబడిన రాజకీయ అనుభవం ఉంది.. ఎంతో తెలివైనవాడని, చాణక్యుడని పొగడ్తలున్నాయి. అయితే తన గొప్పను తానే చెప్పుకుంటున్నారు. ఆ చెప్పేది కాస్తంత చెప్పి ఆపేస్తు బాగుంటుంది. అలా కాకుండా తాను ఎంతో గొప్పలు చెబుతూ నెటిజన్లకు దొరికిపోతున్నారు.

మాట్లాడింది వేరు.. ట్రోలింగ్ జరిగేది వేరు..
ఖమ్మం సభలో కరోనా వైరస్ కనుక్కోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని ప్రకటన చేశారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే తన సహకారం, ప్రోత్సాహంతో ఏర్పాటైన జినోమ్ వ్యాలీ విస్తరించిందని, భారత్ బయోటెక్ అక్కడ ఏర్పాటైందనే అర్థం. భారత్ బయోటెక్ భారత ప్రభుత్వంతో కలిసి కొవాగ్జిన్ టీకాను కనుగొన్న విషయం తెలిసిందే.
అయితే కరోనా టీకా రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అంట.. చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు మొబైల్ ఫోన్ల విప్లవానికి తానే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
దీంతో సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబేనంట అంటూ ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబులో మార్పు రావాలని, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం తగ్గించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
-
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్-కేబినెట్లో మంత్రులతో సీఎం..! -
భారీ ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!! -
ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
దంచి కొడుతున్న ఎండల వేళ భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications