సలార్ సక్సెస్ వేళ పవన్ ను ఆడుకుంటున్న నెటిజన్లు..!!

తెలుగు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. సలార్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి తర్వాత వరుస డిజాస్టర్స్ ఎదరైనా.. ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరి ఆకలి తీర్చేందుకు సలార్ మూవీతో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ మేనియా కనిపిస్తోంది. ఇదే సమయంలో నెటిజన్లు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. సీఎం పదవి షేరింగ్ పైన లోకేష్ కామెంట్స్ ఆధారంగా పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.

సలార్ సక్సెస్ తో : ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సక్సెస్ బాట పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ప్రభంజనం సృష్టించింది. కొన్నిఏరియాల్లో సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది. ప్రభాస్ కటౌట్ చూసి ప్రక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా ఉపయోగించుకున్నాడనేది సోషల్ మీడియా వేదికగా ఆసక్తి కర చర్చ సాగుతోంది. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ బాడీ, ఊరమాస్ లుక్ డైరెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ మూవీలో ప్రతీ సీన్ లో ప్రభాస్ ని నిజంగా ఒక వీర యోధుడిగా చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఫిదా అవుతున్నారు.

Netizens Trolls On Pawan Kalyan over Lokesh Comments, Comapres with Salar goes viral

డైరెక్టర్లు - హీరోల కాంబో : బాహుబలిలో ఒక మహరాజు ఎలా ఉంటాడో దానికి తగ్గట్టుగా చూపించారు రాజమౌళి.. యుద్ద రంగంలో ఒక వీరుడు ఎలా ఉంటాడో చూపించాడు ప్రశాంత్ నీల్ అంటూ చర్చ సాగుతోంది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఒక పోస్టింగ్ వైరల్ అవుతోంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ని బాగా వాడుకుంది వీవీ నాయక్, రాజమౌళి. అల్లు అర్జున్ ని సూపర్ గా వాడుకుంది త్రివిక్రమ్, సుకుమార్. ప్రిన్స్ మహేష్ బాబు ని బాగా వాడుకుంది పూరి జగన్నాథ్. ఇక పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో వాడుకుంది కేవలం మాజీ సీఎం చంద్రబాబు అంటూ ఎక్స్ లో చేసిన పోస్టింగ్ భారీగా సర్క్యులేట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు తో ఏ డైరెక్టర్ పోటీ పడలేరని డైరెక్టర్ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

పవన్ పై కామెంట్స్ : తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అసలు అలాంటి ప్రతిపాదనే లేదని..పవన్ సైతం చంద్రబాబు సీఎంగా ఉంటారని ఇప్పటికే స్పష్టం చేసారని చెప్పుకొచ్చారు. లోకేష్ చేసిన కామెంట్స్ తో నెటిజెన్లు పవన్ తన అభిమానుల కోరిక కాదని..చంద్రబాబు కోసం పని చేస్తున్నారని కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యల పైన పవన్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న చేగొండి హరిరామజోగయ్య లాంటి వారు సైతం స్పందించారు. జనసేన మాత్రం అధికారికంగా రియాక్ట్ కాలేదు. కానీ, పవన్ ను వాడుకుంది చంద్రబాబు అంటూ భారీ ఎత్తున పోస్టింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+