ఏపీలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వారి రుణాల చెల్లింపును సులభతరం చేయడం, మోసాలను అరికట్టడం కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఏటా లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చి పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇంటి నుంచే అందే విధంగా ఈ చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళల కోసం ఓ సరికొత్త యాప్ ను తీసుకు రానుంది. మోసాలను అరికట్టడానికి, రుణాలు సులభతరం చేయడానికి ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలోని మహిళల సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తీపికబురు అందించింది. ఇకపై ఇంట్లో నుంచే దర్జాగా మొబైల్ నుంచే డబ్బులు కట్టే విధానం రాబోతోంది. ఇందుకు అనుగుణంగా ఓ యాప్ ను తీసుకురానున్నట్లు తాజాగా మెప్మా తెలిపింది. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను మొబైల్ నుంచే చెల్లించవచ్చని మెప్మా పేర్కొంది. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలను సక్రమంగా అందించవచ్చు. అంతేకాక స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకునే అవకాశం ఉంది. యాప్ వినియోగంలోకి వస్తే పారదర్శకత పెరుగుతుందని అధికారులు అంటున్నారు.

New App to Help DWCRA Women in AP with Easy Loan Repayments

మరోవైపు ఇటీవల విజయవాడలో జరిగిన మెప్మా కార్యక్రమంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెప్మా వెబ్‌సైట్‌ ను ప్రారంభించారు. భవిష్యత్తులో 80 వేల డ్వాక్రా సంఘాలకు 8 వేల కోట్ల రూపాయల రుణాలు అందించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. మెప్మా పీడీలు ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలకే ఉన్నారని.. వాటిని 26 జిల్లాలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+