జగన్ టీమ్ విస్తరణ.. కొత్త ముఖాలకు చోటు

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీన్ని విస్తరించింది వైఎస్ఆర్సీపీ అగ్రా నాయకత్వం. పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటైంది. పలువురు యువ నాయకులకు ఇందులో చోటు దక్కింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే కొందరికీ ఈ కమిటీలో చోటు కల్పించింది.

వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసన సభ్యుడు జక్కంపూడి రాజా నియమితులయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కొనసాగుతున్నారు. నంద్యాల జిల్లాకు ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు.

New committee for YSRCP s Youth Wing

ఉపాధ్యక్షులుగా.. మెంటాడ స్వరూప్ కుమార్- శ్రీకాకుళం, మేరుగు చందన్ నాగ్- ప్రకాశం, రేగం చాణక్య- అల్లూరి సీతారామరాజు, షేక్ షఫీవుల్లా- వైఎస్ఆర్ కడప నియమితులయ్యారు.

జోనల్ అధ్యక్షులుగా.. అంబటి నాగ వినాయక శైలేష్ (అంబటి శైలేష్)- విశాఖపట్నం, దాడిశెట్టి శ్రీనివాస్- కాకినాడ, కల్లం హరికృష్ణ రెడ్డి- గుంటూరు, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి- ప్రకాశం, పిట్టా హేమంత్ రెడ్డి- చిత్తూరు, ఎల్లారెడ్డిగారి ప్రణయ్ రెడ్డి- అనంతపురం అపాయింట్ అయ్యారు.

ప్రధాన కార్యదర్శులుగా.. కొంగర మురళీ కృష్ణ- అల్లూరి సీతారామరాజు, గౌరా శ్రీహరి- కృష్ణా, దండమూడి రాజేష్- ఎన్టీఆర్, గాలివీటి వివేకానందరెడ్డి- అన్నమయ్య రాయచోటి, కోటగిరి సందీప్- ఏలూరు, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి- నెల్లూరు, పలిశెట్టి సురేష్ రాజ్ కుమార్- అనకాపల్లి, కండ్రేగుల సీహెచ్ అచ్యుతరామారెడ్డి- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ నియమితులయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై యువజన విభాగం దృష్టి సారిస్తుందని వైఎస్ఆర్సీపీ వెల్లడించింది.

కొత్త కమిటీతో వైఎస్ జగన్ త్వరలోనే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశమౌతారని పేర్కొంది. జిల్లా అధ్యక్షులతో తరచూ సమావేశాలను నిర్వహించడం, జిల్లా స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం, అవినీతి, దౌర్జన్యం, ఇతర అక్రమాలపై నిరంతరం స్పందించడం, ప్రజలకు అందుబాటులో ఉండేలా వారికి జగన్ దిశానిర్దేశం చేస్తారని వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+