ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వారికి కొత్త కష్టాలు షురూ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15వ తారీఖున ప్రారంభమైన ఈ స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏపీలో మహిళలతో విశేషంగా ఆదరణ పొందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పథకం వల్ల బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళలలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

స్త్రీ శక్తి పథకంతో పురుషులకు కొత్త కష్టాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం లో భాగంగా మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది. ఇదే సమయంలో ఈ పథకం వల్ల పురుషులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.

New hardships begin for men with the free bus travel scheme

ఆర్టీసీ బస్సులలో తక్కువగా పురుషుల ప్రయాణం
బస్సులలో మహిళల ఆక్యుపెన్సీ పెరగడంతో, పురుషులు బస్సులు ఎక్కాలి అంటేనే భయపడుతున్నారు.మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు అవుతున్న క్రమంలో, మహిళా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో పురుషులు గత వారం రోజులుగా ఆర్టీసీ బస్సులలో తక్కువగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

స్త్రీశక్తి పథకం అమలుతో బస్సులలో ప్రయాణికుల సంఖ్యలో మార్పు
ఇంతకు ముందు వరకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతున్న బస్సులలో 2.21 కోట్ల మంది ప్రయాణం చేసేవారు. అయితే వీరిలో మహిళలు 1.04 కోట్లు, పురుషులు 1. 17 కోట్ల మంది ఉన్నారు. గతంతో పోలిస్తే పురుషుల సంఖ్య చాలా తగ్గింది. ఈ పథకం అమలు అవుతున్న నాటి నుండి ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల సంఖ్యలో మార్పు వచ్చింది.

బస్సులలో ప్రయాణం చేయడానికి పురుషుల విముఖత
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉన్న నేపథ్యంలో బస్సులలో మహిళల ప్రయాణాలతో చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ఏపీలో పురుషులు బస్సులలో ప్రయాణం చేయడానికి కాస్త విముఖతను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు 41.22 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరింది.

బస్సులలో గతంతో పోలిస్తే బాగా తగ్గిన పురుషుల సంఖ్య
గతంలో 60 శాతం పురుషులు 40 శాతం మహిళలు బస్సులలో ప్రయాణించే వారు కానీ ఇప్పుడు మహిళలు 60 శాతానికి పెరిగారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న ఈ పథకం ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలి అనుకునే పురుషులకు కాస్త ఇబ్బందికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+