కేశినేని నాని వర్సస్ చిన్ని - వంగవీటి రాధాతో భేటీ : మద్దతెవరికి..!!

విజయవాడ టీడీపీలో ఇప్పుడు కేశినేని బ్రదర్స్ వ్యవహారం కీలకంగా మారింది. కేశినేని సోదరుల మధ్య కుటుంబ వ్యవహారం ఇప్పుడు రాజకీయ ఎత్తులు..పై ఎత్తులకు కారణమవుతున్నాయి. ఈ ఇద్దరి విభేదాల నడుమ చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు టీడీపీలో ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఒక వైపు ఎంపీ కేశినేని తన కుమార్తె వివాహ నిశ్చితార్ద వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఎంపీ నాని కుమార్తె ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాధాతో చిన్ని సమావేశం

రాధాతో చిన్ని సమావేశం

ఇక, ఇదే సమయంలో తాజాగా కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని అనూహ్యంగా వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుుడు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావటం కోసం పని చేస్తామంటూ గతంలోనే కేశినేని చిన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కేశినేని నాని పోటీ చేయరనే ప్రచారం పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో కేశినేని నాని యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. విజయవాడన నగరంలోని పార్టీ నేతల మద్దత కూడగడుతున్నారు. ఇప్పటికే కేశినేని నానికి టీడీపీలో వ్యతిరేకమని ప్రచారంలో ఉన్న కొందరు నేతలు పరోక్షంగా కేశినేని చిన్నికి మద్దతుగా ఉంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్రయత్నం

వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్రయత్నం


ఇదే సమయంలో విజయవాడ సామాజిక సమీకరణాల్లో భాగంగా.. ఇప్పుడు వంగవీటి రాధా పార్టీలో కీలకంగా మారారు. ఆయన గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరినా పోటీ చేసే అవకాశం దక్కలేదు. కేవలం టీడీపీకి మద్దతుగా ప్రచారానికే పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ నుంచి రాధా బరిలోకి దిగుతారని చెబుతున్నారు. దీంతో.. తనకు టీడీపీ నుంచి టిక్కెట్ ఖరారుతో పాటుగా రంగా అభిమానుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పుడు రాధాతో కేశినేని చిన్ని భేటీ అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాల ద్వారా కేశినేని చిన్ని..తన మద్దతు - బలం పెంచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినాయకత్వం మాత్రం కేశినేని సోదరుల వ్యవహారం ఇది వారి ఫ్యామిలీ అంశమని..ఇందులో రాజకీయం లేదని చెబుతోంది.

పార్టీ హైకమాండ్ మౌనం.. వేడెక్కతున్న రాజకీయం

పార్టీ హైకమాండ్ మౌనం.. వేడెక్కతున్న రాజకీయం


ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అటు ఢిల్లీ కేంద్రంగా కేశినేని నాని ఆఫ్ ది రికార్డు చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియా పోస్టులు..కేశినేని చిన్ని స్పందన..ఇలా ఏ అంశం పైన టీడీపీ నాయకత్వం స్పందించలేదు. దీంతో.. ఇప్పుడు వంగవీటి రాధా తో చిన్ని సమావేశం మర్యాదపూర్వకమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, సొంత పార్టీలో ఇద్దరు సోదరుల మధ్య వివాదం మొదలవ్వటంతో వంగవీటి రాధా.. ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోది. అయితే, పార్టీ నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుంది.. అసలు, కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో నిజంగా పోటీ చేయరా.. లేక, పార్టీ సూచిస్తే తిరిగి పోటీలో ఉంటారా..అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది .దీంతో.. ఇప్పుడు కేశినేని బ్రదర్స్ వ్యవహారం చుట్టూ విజయవాడ టీడీపీ రాజకీయం చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+