ఉధృతి తగ్గని కరోనా: ఏపీలో అదే తీరు: ఈ సారీ భారీగా పాజిటివ్ కేసులు: ఇప్పటికింతే

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతిలో ఏ మాత్రం మార్పు కనిపించట్లేదు. ఒకరోజు తగ్గినట్టే కనిపిస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 24 గంటలు తిరిగే సరికి భారీగా పుంజుకుంటున్నాయి. కళ్లు చెదిరేలా కేసులను నమోదు చేస్తున్నాయి. ఒకసారి తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనల వల్ల ఏపీలో కేసులు పెరగ్గా.. ఈ సారి చెన్నై కోయంబేడు మార్కెట ప్రభావం తీవ్రంగా పడింది. కోయంబేడు మార్కెట్ దెబ్బకు రాష్ట్రంలో కేసులు పెరుగుదల బాట పట్టాయి. తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకే పరిమితం కావట్లేదు దాని ప్రభావం.

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 45 కరనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మూడురోజులుగా నమోదువుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య తక్కువే. అయినప్పటికీ.. ఇది ఇలాగే కొనసాగే పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కనిపించట్లేదు. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన వారి కాంటాక్టులు ట్రేస్ కాకపోడం వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల ఎప్పుడు కనిపిస్తుందో? ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

Newly 45 Covid-19 positive cases have reported in Andhra Pradesh, total reached at 2452

రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు.. కాగా మొత్తం సంఖ్యయ 2452కు చేరింది. ఇందులో డిశ్చార్జి అయిన పేషెంట్ల సంఖ్య 1680 కాగా 54 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో నెల్లూరులో ఓ కరోనా వైరస్ పేషెంట్ మరణించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఇప్పటిదాకా ఉన్న యాక్టివ్ కేసులు 718కి చేరుకున్నట్లు చెప్పారు. మొత్తంగా నమోదైన కేసుల సంఖ్యలో కర్నూలు టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కేసుల సంఖ్య ఆయా జిల్లాల్లోనే అధికంగా నమోదు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+