టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..!!?

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో జరుగుతున్న పరిణామాలు..తగిన గుర్తింపు లేకపోవటం పైన మనస్థాపంతో ఉన్న బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బుచ్చయ్య ఆరు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 అసంతృప్తితో బుచ్చయ్య చౌదరి

అసంతృప్తితో బుచ్చయ్య చౌదరి

బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్..చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సమయంలో ఆయన ఎన్టీఆర్ తో పాటుగా ఉన్నారు. 2014 లో రాష్ట్ర విభజన తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో సీనియర్ గా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటం పైన ఆయన అప్పట్లోనే అసహనం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఉప సభానాయకుడిగా ఉన్నారు. అయినా..పార్టీ నిర్ణయాల్లో ఆయనకు ప్రాధాన్యత దక్కటం లేదు. అదే విధంగా.. పయ్యావుల కేశవ్ నిర్వహిస్తున్న పీఏసీ ఛైర్మన్ పదవిని గోరంట్లకు ఇస్తామని గతంలో పార్టీ అధినేత హామీ ఇచ్చినట్లుగా మాచారం. అయినా..ఇప్పుడు జిల్లా పార్టీతో పాటుగా పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవటం లేదని..సీనియార్టీ- సిన్సియార్టీకి గుర్తింపు లేదంటూ బుచ్చయ్య చౌదరి తన సన్నిహితు ల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది.

 రంగంలోకి అచ్చెన్న

రంగంలోకి అచ్చెన్న

2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లలో గెలవగా..రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. తన రాజీనామాకు సంబంధించి బుచ్చయ్య అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కొంత కాలంగా ఆయన పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి పైన అసంతృప్తితో ఉన్నారు. బుచ్చయ్యను బుజ్జగించటానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగినట్లుగా సమాచారం.

 అచ్చెన్నాయుడు తీరు కూడా కారణం..

అచ్చెన్నాయుడు తీరు కూడా కారణం..

తన సొంత జిల్లా తూర్పు గోదావరిలో తనకు ప్రాధాన్యత లేకుండా..నిమ్మకాయల చినరాజప్ప- అచ్చెన్నాయుడు బంధువులు పెత్తనం చేయటం బుచ్చయ్య చౌదరి మనస్థాపానికి కారణంగా తెలుస్తోంది. రాజమండ్రి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అక్కడి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు బంధువులు అయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, అప్పారావు వంటి వారు షరతులు పెడుతున్నట్లుగా సమాచారం. దీనికి అచ్చెన్నాయుడు మద్దతు ఉందని బుచ్చయ్య చౌదరి భావిస్తున్నారు. అదే సమయంలో జిల్లాతో తాను చెప్పిన వారికి ఎక్కడా పార్టీలో పదవుల విషయంలో న్యాయం చేయటం లేదనే ఆవేదన బుచ్చయ్య లో కనిపిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారి కంటే లాబీయింగ్ చేసుకొనే వారికి..మధ్యలో వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం.

 జూనియర్ కు మద్దుతగా బుచ్చయ్య చౌదరి...

జూనియర్ కు మద్దుతగా బుచ్చయ్య చౌదరి...

పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించే సమయంలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలోకి తీసుకురావాలని..పార్టీలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేసారు. అదే విధంగా చంద్రబాబు మచిలీపట్నం పర్యటలోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు. పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అవసరం అని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ప్రచారంతో పార్టీకి మేలు జరిగిందని గుర్తు చేసారు. పార్టీలో జూనియర్ రాకకు మద్దతిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేగా ఆ సమయంలో పార్టీలో బుచ్చయ్య గురించి చర్చ సాగింది. ఆ ప్రభావం కూడా ఆయన మాట పార్టీలో చెల్లుబాటు కాకుండా పోవటానికి కారణంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+