సైబరాబాద్‌లో కామ్‌స్టాట్, న్యూయార్క్ తరహా (పిక్చర్స్)

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్‌లో న్యూయార్క్ తరహా పోలీసింగ్ విధానానికి పోలీసు కమిషనర్ సివి ఆనంద్ శ్రీకారం చుట్టారు. క్రైమ్ రివ్యూ సమావేశాన్ని ఆయన గురువారంనాడు ఏర్పాటు చేశారు. గతంలో కన్నా భిన్నంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని కామ్‌స్టాట్ (కంప్యూటర్ స్టాటిస్టిక్స్) అంటారు. ఈ విధానాన్ని న్యూయార్క్ పోలీసులు పాటిస్తారని సివి ఆనంద్ చెప్పారు.

సాధారణ సమావేశాల్లో ఉన్నతాధికారులు వేదికపై కూర్చుంటే, దిగువ స్థాయి అధికారులు కింద కూర్చుంటారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన విషయాలను ఉన్నతాధికారులు వివరిస్తారు. క్రైమ్ సమావేశాల్లో తమ తమ పరిధుల్లో జరుగుతున్న నేరాలు, రికవరీలు తదితర అంశాలపై ఆయన జోనల్ అధికారులు కమిషనర్‌కు వివరిస్తారు.

కామ్‌స్టాట్‌ అందుకు భిన్నంగా ఉంటుంది. ఉన్నతాధికారులు కింద కూర్చుంటారు. జోనల్ డిసిపిలు, ఎసిపిలు, క్రైమ్ ఎస్ఐలు వేదికపై కూర్చుంటారు. సంబంధిత డిసిపిలు తమ జోన్‌లకు సంబంధించిన నివేదికను వివరిస్తారు. ఇందులో దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్‌లతో రాత్రీపగలూ దొంగతనాలకు సంబంధించిన విషయాలను కింది స్థాయి అధికారులతో కలిసి వివరిస్తారు.

కామ్‌స్టాట్ ఇలా..

కామ్‌స్టాట్ ఇలా..

తమ తమ జోన్‌ల పరిధుల్లో దొంగతనాలు, రికవరీ, తదితర అంశాలకు సంబంధించి సంబంధిత డిసిపి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తారు.

కామ్‌స్టాట్ ఇలా..

కామ్‌స్టాట్ ఇలా..

ఛేదించిన కేసుల సంఖ్యతో పాటు పెండింగులో ఉన్న కేసులు, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసుల వివరాలను కమిషనర్‌కు వివరిస్తారు.

కామ్‌స్టాట్ ఇలా..

కామ్‌స్టాట్ ఇలా..

విధి నిర్వహణలో తమకు గానీ ఇతర అధికారులకు గానీ సహకరించని కింది స్థాయి సిబ్బంది, సరిగ్గా విధులు నిర్వహించని అధికారులకు సంబంధించి కూడా డిసిపి కమిషనర్‌కు వివరిస్తారు.

కామ్‌స్టాట్ ఇలా..

కామ్‌స్టాట్ ఇలా..

వాటిపై కమిషనర్ అడిగే ప్రశ్నలకు డిసిపితో పాటు ఎసిపి, ఇన్‌స్పెక్టర్, క్రైం ఎస్ఐలు, సిసిఎస్ సిబ్బంది సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

కామ్‌స్టాట్ ఇలా..

కామ్‌స్టాట్ ఇలా..

డిసిపిలు, ఎసిపిలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు తమ తమ పనితనం, తప్పొప్పులు, సరిదిద్దుకోవాల్సిన అంశాలకు సంబంధించి కమిషనర్, జాయింట్ కమిషనర్‌లను ప్రశ్నిస్తారు. ఈ క్రమంలో సిబ్బంది పనితనాన్ని బేరీజు వేస్తారు.

రివ్యూ సమావేశంలో...

రివ్యూ సమావేశంలో...

రివ్యూ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. నేరాల అదుపు, నేరాలను ఛేదించేందుకు ఆధానికి పరిజ్ఞానాన్ని వాడుకోవాలని నిర్ణయించారు.

కరపత్రాలు

కరపత్రాలు

సమాజంలో జరుగుతున్న పలు రకాల నేరాల గురించి వివరిస్తూ కరపత్రాలు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించానలి సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+