Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే vs నిజం విత్ స్మిత: బాలయ్యకు పోటీగా: రేపటి నుంచే..!!

టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తరహాలోనే మరో టాక్ షో బుల్లితెరపై సందడి చేయనుంది. హాయ్ రబ్బా స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న షో ఇది. నిజం విత్ స్మిత అనేది దీని టైటి

అమరావతి: తెలుగులో బుల్లితెరపై నయా ట్రెండ్ మొదలైంది. టాక్ షోల హవా మళ్లీ ఆరంభమైంది. ఇదివరకు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు టాక్‌షోలకు హోస్ట్‌గా పనిచేశారు. టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే గ్రాండ్ సక్సెస్ కావడంతో మళ్లీ ఈ టాక్ షోల ప్రభంజణం మొదలైంది. గతంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని నాగార్జున, రానా, అలీ, మంచు లక్ష్మి.. తళుక్కున మెరిసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి.

 అన్‌స్టాపబుల్ కు పోటీ..

అన్‌స్టాపబుల్ కు పోటీ..

ప్రస్తుతం- అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే, అలీతో సరదాగా టాక్ షోస్ ఆకట్టుకుంటోన్నాయి. బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే- ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పుడదే లైన్ లో మరొకటి రాబోతోంది. నిజం విత్ స్మిత అనే టైటిల్ తో ప్రసారం కాబోతోంది. టాప్ సింగర్ హాయ్ రబ్బా స్మిత దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తోన్నారు. సోనీ లివ్ యాజమాన్యం ఈ టాక్ షో ను నిర్వహిస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ శుక్రవారం సోనీ లివ్ యాప్ లో ప్రసారం కానుంది.

సినిమాలు, రాజకీయాలు..

సినిమాలు, రాజకీయాలు..

అన్ స్టాపబుల్ తరహాలోనే ఈ టాక్ షో కూడా సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలతో ముడిపడినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు రామ్ మాధవ్.. వంటి టాప్ పొలిటీషియన్స్‌ ఈ షోలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అడవి శేష్, నాని, రానా, సాయిపల్లవి, రాధిక, అల్లరి నరేష్, అనిల్ రావిపూడి, దేవాకట్టా, సందీప్ వంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటులు దర్శకులు, టెక్నీషియన్స్ తో ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది.

చిరంజీవి ప్రొమో అవుట్..

చిరంజీవి ప్రొమో అవుట్..

వాటికి సంబంధించిన గ్లింప్సెస్ తో కూడిన ఓ ప్రొమోను స్మిత తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన తరువాతి ప్రాజెక్ట్ ఇదేనంటూ వెల్లడించారు. చిరంజీవి నటించిన ఎపిసోడ్ ప్రొమో ఇవ్వాళ విడుదలైంది. సోనీ లివ్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ పై దీన్నిపోస్ట్ చేసింది.

సినిమాలతో పాటు..

చంద్రబాబు నాయుడు, చిరంజీవి, రామ్ మాధవ్ తో చిత్రీకరించిన వేర్వేరు ఎపిసోడ్స్ ఆసక్తి రేపుతోన్నాయి. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారనే విమర్శలను ఎదుర్కొంటోన్న చంద్రబాబుతో దీనికి సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారు స్మిత. ఇందులో ప్రస్తుత తెలంగాణ సీఎం కూడా భాగస్వామేనని, అప్పట్లో అందరం కలిసి.. అంటూ చంద్రబాబు చెప్పడం మరోసారి వెన్నుపోటు ఉదంతాన్ని తెర మీదికి తెచ్చినట్టయింది. దీనికి చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నట్టయింది.

 అన్‌స్టాపబుల్ లో..

అన్‌స్టాపబుల్ లో..

ఇదివరకు ఇదే వెన్నుపోటు ఉదంతంపై చంద్రబాబు.. తన బావమరిది నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో స్పందించిన విషయం తెలిసిందే. వైస్రాయ్ ఘటన ఎందుకు చోటు చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. అప్పట్లో అది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే అంశం ప్రస్తావనకు రావడం.. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+